Reading Time: < 1 minute

ఐపీఎల్లో విషాదం.. స్టేడియంలో నిశ్శబ్దం.. గ్రౌండ్లోకి అంబులెన్స్.. లుంగీ ఎంగిడీ కోలుకోవాలని ప్రార్థనలు

Caption of Image.

ఢిల్లీలో జరుగుతున్న ఢిల్లీ వర్సెస్ పంజాబ్ ఐపీఎల్ మ్యాచ్లో ఊహించని విషాదం. పంజాబ్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో.. గ్రౌండ్ లో ఫీల్డింగ్ చేస్తున్నాడు ఢిల్లీ ప్లేయర్ లుంగీ ఎంగిడీ. 

సరిగ్గా ఈ సమయంలోనే.. అక్షర పటేల్ బౌలింగ్ లో.. ప్రియాన్ష్ ఆర్యా బ్యాటింగ్ చేశాడు. ప్రియాన్ష్ కొట్టిన షాట్ ను.. ఫీల్డింగ్ లో ఉన్న లుంగీ పట్టుకోవటానికి ప్రయత్నించాడు. గాల్లో ఉన్న బాల్ ను పట్టుకునేందుకు.. పైకి చూస్తూ.. వెనక్కి వెళుతున్నాడు. ఈ సమయంలోనే అదుపు తప్పి వెనక్కి పడ్డాడు లుంగీ ఎంగిడీ.

ఫీల్డింగ్ చేస్తూ వెనక్కి పడిన లుంగీ ఎంగిడీ మెడ పట్టేసింది. కదలలేకపోయాడు. వెంటనే గ్రౌండ్ లోకి వచ్చిన ఫిజియోథెరపిస్టులు ప్రాథమిక చికిత్స చేశారు. అప్పటికీ లుంగీ ఎంగిడీకి ఎలాంటి రిలీఫ్ దొరకలేదు. మెడ దగ్గర గాయం తీవ్రంగా ఉండటంతో.. గ్రౌండ్ లోకి అంబులెన్స్ వచ్చింది. అంబులెన్స్ నుంచి స్ట్రెచర్ బయటకు తీశారు. స్ట్రెచర్ పై ఉంచి చికిత్స చేశారు డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులు. లుంగీ ఎంగిడీ మెడ దగ్గర గాయం తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ క్రమంలోనే లుంగీ ఎంగిడీని.. గ్రౌండ్ లోని అంబులెన్స్ నుంచి నేరుగా ఆస్పత్రికి తరలించారు. అతని వెంట ఫిజియోథెరపిస్ట్ ఒకరు ఆస్పత్రికి వెళ్లారు.

©️ VIL Media Pvt Ltd.