
మలయాళ నటుడు నివిన్ పౌలీ ప్రధాన పాత్రలో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతిఛాయ’(ప్రతిబింబం అని అర్థం). బి. ఉన్నికృష్ణన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 26, 2026న థియేటర్లలో విడుదలై మంచి చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఏప్రిల్ 24, 2026 నుంచి జియో హాట్‌స్టార్లో స్ట్రీమ్ అవుతూ ఎంగేజ్ చేస్తోంది. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చింది.
కేరళ రాజకీయాల చుట్టూ తిరిగే ఫిక్షన్ స్టోరీ ఇది. రాష్ట్ర ముఖ్యమంత్రిపై ఒక మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో మొదలవుతుంది. అక్కడి నుంచి రాజకీయ కుట్రలు, కార్పొరేట్ కుతంత్రాలు, అధికార దాహం వంటి అంశాలతో కథ ముందుకు సాగుతుంది. కేరళ రాజకీయాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం, సమకాలీన రాజకీయ వాస్తవాలను కళ్ళకు కట్టినట్లుగా చూపిస్తుంది. చాలా కాలం తర్వాత నివిన్ పౌలి హుందాగా, అండర్‌ప్లే నటనతో మెప్పించగా, షరాఫుద్దీన్ విలన్‌గా తన పాత్రకు బలాన్ని తెచ్చాడు.
Prathichaya is now streaming exclusively on JioHotstar.@NivinOfficial @sbcmenon @unnikrishnanb @actorsharafu#Prathichaya #JioHotstar #JioHotstarMalayalam #Thriller #Drama #MalayalamMovie #PoliticalDrama #WatchNow #NowStreaming pic.twitter.com/K3TJE8TGgm
— JioHotstar Malayalam (@JioHotstarMal) April 23, 2026
‘ప్రతిఛాయ’ కథ:
గ్రే షేడ్స్‌తో ఉన్న ముఖ్యమంత్రి కె.ఎన్. వర్గీస్ (బాలచంద్ర మీనన్) మంచి వ్యక్తే అయినా, అవసరమైతే తన అధికారాన్ని వినియోగించడంలో వెనుకాడడు. ఒక కుంభకోణంలో చిక్కుకుని పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా సీఎం తనను లైంగిక వేధించాడంటూ ఓ మహిళ ఆరోపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత తీవ్ర మనస్తాపంతో వర్గీస్ మరణిస్తాడు.
ఈ నేపథ్యంలో టెక్ ఎంట్రప్రెన్యూర్ అయిన అతని కుమారుడు జాన్ (నివిన్ పౌలి) రాజకీయాల్లోకి అడుగుపెడతాడు. కుటుంబ ప్రతిష్టను కాపాడాటానికి వచ్చిన అతనికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తన తండ్రి నిజంగానే సదరు మహిళను వేధించాడా? జాన్ ఎంట్రీతో కేరళ పాలిటిక్స్ ఎలా మారిపోయాయి? అన్నదే ఈ సినిమా మిగతా కథ.
ఎలా ఉందంటే..
దర్శకుడు బి. ఉన్నికృష్ణన్ కథను పొలిటికల్ థ్రిల్లర్‌గా ప్రెజెంట్ చేయడంలో ఓ మాదిరి సక్సెస్ అయ్యారు. కథలో ఉన్న కాన్సెప్ట్ బలంగా
ఉన్నప్పటికీ, స్క్రీన్‌ప్లే మాత్రం కొన్ని చోట్ల నెమ్మదిగా సాగుతూ ఆసక్తిని తగ్గిస్తుంది. సినిమాటోగ్రఫీ కేరళ నేపథ్యాన్ని సహజంగా, రియలిస్టిక్‌గా చూపిస్తుంది. కథకు కీలకమైన న్యూస్ ఛానల్‌లో సీఎం లైవ్ ఇంటర్వ్యూ ‘ఒకే ఒక్కడు’ ఇంటర్వ్యూను గుర్తుచేస్తుంది.
ముఖ్యంగా ఈ సినిమా ఫస్టాఫ్ కాన్సెప్ట్ రానా దగ్గుబాటి ‘లీడర్’ను గుర్తు చేస్తుంది. అంటే.. కథ, పాత్రలు, సన్నివేశాలు వేరే అనిపించినా, తండ్రి చనిపోయిన అనంతరం.. కొడుకు ఎంట్రీ ఇవ్వడం.. ఆపై మొదలై సీన్స్ లీడర్ సినిమాను గుర్తుచేస్తాయి. ఓవరాల్గా.. పొలిటికల్ థ్రిల్లర్ చూడాలనుకునే వారికీ.. ఇది బెస్ట్ ఛాయిస్గా నిలిచే ఛాన్స్ ఉంది.