Reading Time: < 1 minute
Us Iran Talks Islamabad Iran Delegation Leaves Uncertainty

US-Iran talks: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరుగుతున్న రెండో విడత అమెరికా-ఇరాన్ శాంతి చర్చల్లో అనిశ్చితి ఏర్పడింది. ఇరాన్ ప్రతినిధి బృందం అర్ధాంతరంగా పాక్ నుంచి వెళ్లిపోయింది. పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరఘ్చీ సమావేశం జరిగిన తర్వాత, ఆయన తన ప్రతినిధి బృందంతో ఇస్లామాబాద్ నుంచి వెళ్లిపోయారు. దీంతో యూఎస్, ఇరాన్ చర్చలపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Read Also: PM Modi : మే 9న తెలంగాణకు ప్రధాని మోడీ.. పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ.!

ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి ఇషాక్ దార్, ఆర్మీ చీప్ అసిమ్ మునీర్ కూడా హాజరయ్యారు. ఈ సమావేశానికి సంబంధించి పాక్ ప్రధాని కార్యాలయం ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇదిలా ఉంటే, స్టీవ్‌ విట్ కాఫ్, జారెడ్ కుష్నర్‌లతో కూడిన అమెరికా ప్రతినిధి బృందం రెండో విడత చర్చల కోసం ఇస్లామాబాద్‌కు రానున్న తరుణంలో అరఘ్చీతో పాక్ ప్రధాని సమావేశం జరిగింది. అమెరికాతో ప్రత్యక్ష చర్చలకు ఇరాన్ సుముఖంగా లేదని తెలుస్తోంది.

అయితే, ఇరాన్ తమ ప్రతిపాదనల్ని పాకిస్తాన్ ద్వారా అమెరికాకు చేరవేస్తోంది. పాక్ నుంచి వెళ్లిని ఇరాన్ మంత్రి అరాఘ్చీ ఒమన్, రష్యాలకు కూడా వెళ్లనున్నారు. ఇరాన్ ఏక కాలంలో పలు దేశాల ద్వారా సంప్రదింపులు జరుపుతోందని తెలుస్తోంది. దీనికి ముందు, ఇరాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ మాట్లాడుతూ.. ఇరాన్, అమెరికా మధ్య ప్రత్యక్ష సమావేశం ఉండదని స్పష్టం చేశారు.