Reading Time: 2 minutes
Video: 6,4,4,4,4,6.. బీసీసీఐ ఛీకొట్టింది.. కట్‌చేస్తే.. ఒకే ఓవర్‌లో 28 పరుగులతో ఇచ్చిపడేశాడుగా..

Nitish Rana 28 Runs in One Over: ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నితీష్ రాణాను ఎన్నో ఆశలతో ట్రేడింగ్ ద్వారా దక్కించుకుంది. అయితే ఈ సీజన్ ఆరంభంలో వరుసగా మూడు మ్యాచ్‌లలో అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఒక దశలో తుది జట్టు నుంచి కూడా తొలగించారు. కానీ, జట్టు యాజమాన్యం అతనిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, పంజాబ్ కింగ్స్‌తో జరిగిన పోరులో రాణా అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అతను, పంజాబ్ బౌలర్లను చితక్కొట్టాడు.

బార్ట్లెట్ ఓవర్‌లో పరుగుల సునామీ..

మ్యాచ్ 12వ ఓవర్‌లో పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, ఆస్ట్రేలియా పేసర్ జేవియర్ బార్ట్లెట్‌కు బంతిని అందించాడు. అయితే ఈ నిర్ణయం పంజాబ్ జట్టుకు ఊహించని నష్టాన్ని తెచ్చిపెట్టింది. నితీష్ రాణా ఆ ఓవర్‌లో బార్ట్లెట్‌ను ఓ గల్లీ ప్లేయర్ లా ఆడుకున్నాడు. ఆ ఓవర్ మొదటి బంతినే భారీ సిక్సర్‌గా మలిచిన రాణా, ఆ తర్వాత వరుసగా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఆ ఓవర్ ముగిసేసరికి స్కోరు బోర్డుపై 28 పరుగులు చేరాయి. ఇది ఢిల్లీ బ్యాటర్లు ఒకే ఓవర్‌లో సాధించిన అత్యధిక పరుగుల జాబితాలో ఒకటిగా నిలిచింది.

ఢిల్లీ క్యాపిటల్స్ తరపున రికార్డులు..

ఐపీఎల్ చరిత్రలో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఢిల్లీ బ్యాటర్ల జాబితాలో రాణా చేరాడు:

30 పరుగులు: జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్ (హైదరాబాద్‌పై, 2024)

30 పరుగులు: రిషబ్ పంత్ (గుజరాత్‌పై, 2024)

30 పరుగులు: వీరేందర్ సెహ్వాగ్ (డెక్కన్ ఛార్జర్స్‌పై, 2008)

28 పరుగులు: నితీష్ రాణా (పంజాబ్‌పై, నేడు)

రాహుల్ – రాణా జోడీ సంచలనం..

మరోవైపు ఓపెనర్ కేఎల్ రాహుల్ అద్భుత శతకంతో కదం తొక్కగా, నితీష్ రాణా 44 బంతుల్లోనే 91 పరుగులు చేసి అతనికి గట్టి సహకారాన్ని అందించాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు ఏకంగా 220 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇది ఐపీఎల్ చరిత్రలోనే రెండో అత్యధిక భాగస్వామ్యంగా నమోదైంది. రాణా తన ఇన్నింగ్స్‌లో 206కు పైగా స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..