Reading Time: < 1 minute

దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్ విక్రమ్ 1.. జెండా ఊపి శ్రీహరి కోటకు పంపిన సీఎం రేవంత్

Caption of Image.

ఇండియాలోనే తొలి ప్రైవేట్ రాకెట్ గా రికార్డుకెక్కిన విక్రమ 1 రాకెట్ ను ఫ్లాగ్ ఆఫ్​ చేసి శ్రీహరి కోటకు పంపారు సీఎం రేవంత్ రెడ్డి. 2026 ఏప్రిల్ 25న శంషాబాద్ ఏరోస్పేస్ పార్క్‌లోని స్పైరూట్ సంస్థను సందర్శించారు సీఎం. ఆ సంస్థ తయారు చేసిన భారత  తొలి ప్రైవేట్ కమర్షియల్ రాకెట్ విక్రమ్-1 గురించి తెలుసుకున్నారు. 

స్కైరూట్ సంస్థలో రాకెట్ తయారీ, టెక్నాలజీ తదితర అంశాల గురించి చర్చించారు సీఎం. తొలి ప్రైవేట్ రాకెట్ తయారు చేసిన సంస్థ యాజమాన్యాన్ని అభినందించారు. రాకెట్ ను శ్రీహరికోట లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి లాంచ్ చేయనున్నారు. దీంతో సీఎం రేవంత్ జెండా ఊపి శ్రీహరి కోటకు పంపారు.  

  • విక్రమ్ 1 విశేషాలు:

హైదరాబాద్‌కు చెందిన స్పేస్‌టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ (Skyroot Aerospace) అభివృద్ధి చేసిన విక్రమ్-1 (Vikram-1), భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ కమర్షియల్ ఆర్బిటల్ రాకెట్. 2025 నవంబర్‌లో ఈ రాకెట్ ను ఆవిష్కరించారు.  480 కిలోల బరువున్న ఉపగ్రహాలను తక్కువ భూ కక్ష్యలోకి (LEO) తీసుకెళ్లగలదు దీనిని పూర్తిగా కార్బన్ ఫైబర్‌తో నిర్మించడం విశేషం.

ప్రత్యేకత: ఇది 3D ప్రింటెడ్ ఇంజన్‌లను కలిగి ఉండి.. పూర్తిగా కార్బన్-ఫైబర్ బాడీ రాకెట్. కార్బన్ ఫైబర్ వాడటం వలన ఇది తేలికగా, బలంగా ఉంటుంది.
సామర్థ్యం: సుమారు 300 – 480 కిలోల బరువున్న ఉపగ్రహాలను 500 కిలోమీటర్ల లో–ఎర్త్ ఆర్బిట్ (LEO) లోకి ప్రవేశపెట్టగలదు.
ప్రయోగం: 2026  లో త్వరలో అంతరిక్షంలోకి వెళ్లనుంది.
భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ పేరు మీద ఈ రాకెట్‌కు ‘విక్రమ్-1’ అని పేరు పెట్టారు.
పరిశ్రమ: ఇది పూర్తి స్వదేశీ సాంకేతికతతో, 100% భారతదేశంలోనే తయారైంది. 
 

©️ VIL Media Pvt Ltd.