మొక్కజొన్న పకోడికి కావాల్సిన పదార్ధాలు : ఒక కప్పు మొక్కజొన్న గింజలు, అర కప్పు శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి, ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు,నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు కరివేపాకు ఆకులు, అర కట్ట కొత్తిమీర, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడు సోడా ఉప్పు, రెండు టేబుల్ స్పూన్స్ నూనెను తీసుకోవాలి.
మొక్కజొన్న పకోడి ఎలా తయారు చేయాలంటే? ముందుగా మొక్కజొన్న గింజలను తీసుకుని, వాటిని మిక్సీలో గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. దానిని ఒక ముద్దలాగా చేసుకోవాలి. ఒక గిన్నెలో గ్రైండ్ చేసిన మొక్కజొన్న,కొద్దిగా శెనగపిండి, రెండు టేబుల్ స్పూన్స్ బియ్యపు పిండి వేసుకోండి.
ఈ మిశ్రమంలో ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు , నాలుగు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నాలుగు కరివేపాకు, అర కట్ట కొత్తిమీర దీనిలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసి దానిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు వేసి పకోడీ మిశ్రమం లాగా తయారు చేయండి.
ఈ పకోడీలను బాగా వేయించాలి : చివర్లో కొద్దిగా సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేస్తే క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు గ్యాస్ వెలిగించి పాన్ లో నూనె చేసి అది వేడయ్యాక, ఈ మిశ్రమాన్ని తీసుకుని చిన్న చిన్న ముద్దలుగా తీసుకుని డీప్ ఫ్రై చేయాలి. బంగారు కలర్లోకి మారే వరకు రెండు వైపులా కాల్చే వరకు బాగా వేయించాలి
సాయంత్రం వేడి వేడిగా ఉంటే ఆ రుచే వేరు : వేడి వేడి పకోడీని తీసుకుని, వీటిలో టమోటా సాస్ లేదా పల్లీలు చట్నీతో తింటే అద్భుతంగా ఉంటుంది. అయితే, వీటిని సాయంత్రం తింటే రుచి ఇంకా బాగుంటుంది. టీ లో నంజుకుంటే అబ్బబ్బ అంటూ ప్లేట్స్ మీద ప్లేట్స్ లాగిస్తూనే ఉంటారు. ఈ సారి మీ ఇంట్లో ట్రై చేయండి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు తింటూనే ఉంటారు.




