Reading Time: < 1 minute

ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్ స్టీన్ సెక్స్ కుంభకోణానకి సంబంధించిన కథనాలలో తన పేరు, తన రాసక్రీడలు వెలుగులోకి రావడంతో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పౌండేషన్ సిబ్బందికి బేషరతుగా క్షమాపణ చెప్పారు. తనపై కథనాలు వెలుగులోకి రావడంతో భారతదేశంలో జరిగిన ఎఐ ఇంపాక్ట్ సమ్మిట్ నుంచి వైదొలగిన బిల్ గేట్స్ కొత్తగా వెలువడిన ఎప్ స్టీన్ పత్రాలు తనను దోషిగా చూపడంతో తీవ్ర ఆవేదనతో గేట్స్ పౌండేషన్ సిబ్బందికి బహిరంగ క్షమాపణలు చెప్పారు.

ఇటీవల టౌన్ హాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో గేట్స్ పాల్గొన్నారు. ఎప్ స్టీన్ ఫైళ్లలో పేర్కొన్నట్లు రష్యన్ మహిళలతో తనకు రెండు సంబంధాలు ఉన్నాయని అంగీకరించినట్లు తెలిసింది. అయితే తనకు ఎప్ స్టీన్ బాధితులతో ఎలాంటి సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు. గేట్స్, ఎప్ స్టీన్ మధ్య జరిగిన పలు సమావేశాలను వివరించే అమెరికా జస్టిస్ డిపార్ట్ మెంట్ రికార్డులు, ఆయన చిత్రాలు వెలుగులోకి రావడంతో గేట్స్ పై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. వీటిలో బిల్ గేట్స్ ముఖాలు తొలగించబడిన మహిళలతో ఫోజులు ఇచ్చిన ఫోటోలు ఉన్నాయి. ఫౌండేషన్ అంతర్గత సమావేశంలో గేట్స్ తన తప్పిదాలను ఒప్పుకున్నారు.

ఎప్ స్టీన్ తో సమయం గడపడం, అతడితో సమావేశాలలో సీనియర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ లు పాల్గొనేలా చేయడం చాలా పెద్దతప్పు అని పేర్కొన్నట్లు తెలిసింది. సంస్థలోని ప్రభావితమైన వారికి క్షమాపమలు చేప్పారు. నేను చేసిన తప్పు కారణంగా దీనిలోకి ఆకర్షితులైన ఇతర వ్యక్తులను కూడా తాను క్షమాపణలు కోరుతున్నట్లు బిల్ గేట్స్ పేర్కొన్నారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ నెల ప్రారంభంలో ఫౌండేషన్ ఓ ప్రకటనలో సంస్థ కు ఎప్ స్టీమ్ కు ఎటువంటి ఆర్థిక సంబంధాలు లేవని, ఎలాంటి చెల్లింపులు చేయలేదని, ఎప్ స్టీన్ ను ఎప్పుడూ ఏ పదవిలోనూ నియమించలేదని స్పష్టం చేసింది.నిజానికి గేట్స్ ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొని ఏఐ పై ప్రసంగించవలసి ఉంది కానీ, చివరి క్షణంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు.