Reading Time: < 1 minute
Ramani Kalyanam Movie Teaser Launched By Actress Jayasudha Surya Vasishta

కంటెంట్ ప్రధానంగా, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన తాజా చిత్రం ‘రమణి కళ్యాణం’. కైట్స్ క్రియేటివ్స్ బ్యానర్‌పై సూర్య వశిష్ట, దీప్షిక లీడ్ రోల్స్‌లో విజయ్ ఆదిరెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం టీజర్‌ను సహజనటి జయసుధ చేతుల మీదుగా గ్రాండ్‌గా లాంచ్ చేశారు. సాధారణంగా కమర్షియల్ సినిమాల్లో హీరో హీరోయిన్ల పాత్రలు రెగ్యులర్‌గా ఉంటాయి. కానీ ఈ సినిమాలో ఇద్దరి పాత్రలు ఛాలెంజింగ్‌గా ఉండటం విశేషం. హీరో సూర్య వశిష్ట వీల్ చైర్‌కే పరిమితమయ్యే యువకుడిగా నటిస్తుండగా.. హీరోయిన్ దీప్షిక కంటిచూపు లేని (అంధురాలి) పాత్రలో నటిస్తోంది.

ఈ సందర్భంగా హీరో సూర్య వశిష్ట మాట్లాడుతూ.. “రమణి కళ్యాణం అనే టైటిల్‌లోనే పాజిటివ్ ఎనర్జీ ఉంది. వీల్ చైర్‌లో కూర్చుని ఎటూ కదలకుండా నటించడం నాకు ఒక సవాల్‌గా అనిపించింది. ఇదొక క్లీన్ ఫ్యామిలీ మూవీ” అని తెలిపారు. హీరోయిన్ దీప్షిక మాట్లాడుతూ.. అంధురాలి పాత్రలో నటించడం ఛాలెంజింగ్‌గా అనిపించిందని, ఈ సినిమా ప్రతి ఒక్కరికీ ఒక ‘హోప్’ ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. దర్శకుడు విజయ్ ఆదిరెడ్డి మాట్లాడుతూ.. “రామ్ జగదీశ్ రాసిన మాటలు ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయి. మంచి టీమ్ సపోర్ట్‌తో ప్యాషన్‌గా ఈ సినిమాను తీశాం. థియేటర్లలో చూస్తేనే ఆ అసలైన అనుభూతి దక్కుతుంది” అని తెలిపారు. జయసుధ గారి ప్రశంసలు తమకు ఎంతో ఎనర్జీ ఇచ్చాయని నిర్మాత శ్రీనాథ్ పసుపులేటి పేర్కొన్నారు.