Reading Time: < 1 minute
Sepoy Janjal Pravin Prabhakar Kirti Chakra Posthumous Award President Murmu

దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు కీర్తి చక్ర పురస్కారం లభించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రవీణ్ ప్రభాకర్ తల్లికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డు అందజేశారు. ఈ సందర్భంగా తల్లి తీవ్ర దు:ఖంలో మునిగిపోయింది. ప్రవీణ్ ప్రభాకర్ గొప్పతనం వినిపిస్తుండగా వెక్కి వెక్కి ఏడ్చింది. ఇక అవార్డు అందజేసిన తర్వాత రాష్ట్రపతి దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఇక ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

దేశ సేవలో అసాధారణ ధైర్యసాహసాలు, అచంచల వీరత్వం ప్రదర్శించి అత్యున్నత త్యాగం చేసిన సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్‌కు మరణానంతరం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మక కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేసింది. విధి నిర్వహణలో అపార సాహసం, అజేయ ధైర్యం కనబరిచి దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన ఆయన సేవలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించారు. దేశ భద్రత కోసం చేసిన త్యాగం సైనిక దళాలకు, యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. సిపాయి జంజాల్ ప్రవీణ్ ప్రభాకర్ వీరోచిత సేవలు, దేశభక్తి, అత్యున్నత త్యాగానికి గుర్తింపుగా ఈ పురస్కారం అందజేయడం పట్ల దేశవ్యాప్తంగా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.