Reading Time: < 1 minute

మన తెలంగాణ/హైదరాబాద్: హైడ్రా కూల్చివేతలపై  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎలాంటి కూల్చివేతలు చేపట్టరాదని స్పష్టం చేసింది. కూల్చివేతలపై హైడ్రాకు సరైన ప్రామా ణికత లేదని హైకోర్టు అభిప్రాయపడింది. నోటీ సులు ఇవ్వకుం డానే కూల్చివేతలు చేపడు తున్నారని ఉన్నత న్యాయస్థానం ఆక్షేపించింది. అమీన్‌పూర్ మండలం ఐలాపూర్ హైడ్రా కూల్చి వేతలపై షరీఫ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అమీన్‌పూర్ కూల్చివేతల వీడియోలను పిటిషనర్లు కోర్టుకు సమర్పించారు. నోటీస్ ఇవ్వకుండా కూల్చివేశారని పిటిషనర్ తరపు న్యాయవాది రవిచందర్ వాదించారు. వెయ్యి ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణకు యత్నించారని, అనుమతి లేకుండా భవనాలు నిర్మిం చారని ఎఎజి ఇమ్రాన్ ఖాన్ తన వాదనను వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఎలాంటి కూల్చి వేతలు చేపట్టరాదని స్పష్టపరుస్తూనే.. చెరువులు, పార్కులు, రహదా రులు ఆక్రమిస్తే నిబంధనల మేరకు మాత్రమే కూల్చివేతలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.