Reading Time: < 1 minute
Tollywood February 2026 Box Office Report 20 Releases No Single Hit

ఫిబ్రవరి మొదటి వారంలో చిన్న సినిమాలు వరుసగా థియేటర్లలోకి వచ్చాయి. ప్రచారం భారీ ఎత్తున నిర్వహించిన కూడా ప్రేక్షకులను అలరించడంలో విఫలమయ్యాయి.. దాదాపు ఇరవై సినిమాలు రిలీజ్ కాగా ఏ సినిమా ఎలాంటి ఫలితాలను అందుకుందో చుద్ద్దాం..

యుఫోరియా : గుణశేఖర్ దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ఈ యూత్‌ఫుల్ సినిమా  ప్రచారం ఎంత చేసినా, ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టుకున్న గుణశేఖర్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు.

అదే వారంలో విడుదలైన విత్ లవ్ఆపరేషన్ పద్మబరాబర్ ప్రేమిస్తాబ్లడ్ రోజెస్లగ్గంఎర్రచీర వంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద  మొదటి రోజే డిజాస్టర్‌గా నిలిచాయి.

 ఫంకీ :  విశ్వక్ సేన్ నటించిన ఈ సినిమా ఫలితం ఫ్లాప్‌గానే మారింది. కామెడీ ఏ మాత్రం మెప్పించకపోవడంతో డిజాస్టర్ గా నిలిచి విశ్వక్ ఖాతాలో మరోక ప్లాప్ ఇచ్చింది.

 కపుల్ ఫ్రెండ్లీ : సంతోష్ శోభన్ హీరోగా నటించన ఈ చిత్రం ఊహించిన దానికంటే మెరుగైన వసూళ్లు సాధించి కొంత ఊరటనిచ్చింది. లాంగ్ గ్యాప్ తర్వాత సంతోష్ కు హిట్ దక్కింది. ప్రభాస్ ప్రచారం ఈ సినిమాకు ఉపయోగపడింది.

సీతాపయనం : సీనియర్ నటుడు అర్జున్ తన కూతుర్ని హీరోయిన్‌గా పరిచయం చేస్తూ తీసిన సీతాపయనం కూడా ప్రేక్షకాదరణ పొందలేదు. సీరియల్ లాగా ఉందనే కామెంట్స్ వినిపించాయి.

అదే రోజు వచ్చిన అమరావతికి ఆహ్వానంస్కైనిలవే వంటి సినిమాలు కూడా ఫ్లాప్ జాబితాలో చేరాయి. సుహాస్ హే బలవంత్,  శివ కందుకూరి నవాబ్ కేఫ్ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లాయి.

విష్ణువిన్యాసం : శ్రీవిష్ణు అంటే మినిమం గ్యారెంటీ హీరో. ఎలాంటి కథతో వచ్చిన మినిమం ఓపెనింగ్ ఉంటుంది. కానీ ఈ సినిమా కనీస ఓపెనింగ్స్ కూడా రాబట్టలేకపోయింది. మొదటి వారం ముగిసేలోపే ఫ్లాప్‌గా తేలిపోయింది. బయ్యర్స్ కు నష్టాలు తెచ్చిపెట్టింది.

మొత్తంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో దాదాపు 20 సినిమాలు విడుదలైనప్పటికీ ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. చిన్న సినిమాలకు థియేటర్ సమస్యలు, సరైన ప్రమోషన్ లేకపోవడం, కంటెంట్ బలహీనత వంటి అంశాలు ప్రతికూలంగా మారాయి. ఇలా ఫిబ్రవరి టాలీవుడ్‌కు నిరాశాజనకమైన నెలగా మిగిలింది.