
SRH vs RR: ఐపీఎల్ 2026లో మరో హై-వోల్టేజ్ పోరు క్రికెట్ ప్రేమికులను అలరించింది. రాజస్థాన్ రాయల్స్ నిర్దేశించిన 229 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) అద్భుత పోరాటంతో ఛేదించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.
అభిషేక్ -ఇషాన్ విధ్వంసం:
భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌కు ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. ఇంపాక్ట్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ (6)ని జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో త్వరగానే వెనుదిరిగాడు. ఇక, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ రాజస్థాన్ బౌలర్లను ఒక ఆటాడుకున్నారు. అభిషేక్ శర్మ( 29 బంతుల్లో 11 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 57 పరుగులు) హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయానికి బలమైన పునాది వేశాడు. మరోవైపు, ఇషాన్ కిషన్ (31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 74 పరుగులు) విధ్వంసం సృష్టించాడు. వీరిద్దరి మధ్య నెలకొన్న 132 పరుగుల భాగస్వామ్యం మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
మిడిల్ ఆర్డర్ మెరుపులు:
అభిషేక్, ఇషాన్ అవుట్ అయిన తర్వాత నితీష్ కుమార్ రెడ్డి (36 పరుగులు – 18 బంతుల్లో), హెన్రిచ్ క్లాసెన్ తమ మార్క్ హార్డ్ హిట్టింగ్‌తో స్కోరు బోర్డును పరిగెత్తించారు. చివర్లో సలీల్ అరోరా భారీ సిక్సర్ బాదడంతో సన్‌రైజర్స్ విజయం ఖాయమైంది. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నప్పటికీ, మిగిలిన బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. బ్రిజేష్ శర్మ చెరో రెండు వికెట్లు తీసుకోగా, డొనోవన్ ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. కాగా వైభవ్ సూర్యవంశీ సెంచరీ వృథా అయినప్పటికీ, సన్‌రైజర్స్ బ్యాటర్ల సమిష్టి కృషితో ఆరెంజ్ ఆర్మీ జైపూర్‌లో చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది.
Effortless Striking 🔥
7⃣4⃣(31) of pure entertainment from the bat of Ishan Kishan 👏👏
Updates ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @SunRisers | @ishankishan51 pic.twitter.com/yh3uDyJqf4
— IndianPremierLeague (@IPL) April 25, 2026