Reading Time: < 1 minute
Us Iran Talks Fail Islamabad Trump Announcement

Donald Trump: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదిక గా జరగాల్సిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది. తాజాగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ చర్చల కోసం స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ పాకిస్తాన్ పర్యటనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ చర్చల కోసం 18 గంటల విమాన ప్రయాణాలు ఇక లేవని, తమ దగ్గర అన్ని ఆప్షన్లు ఉన్నాయని ఆయన అన్నారు. ఇస్లామాబాద్ పర్యటన రద్దు చేసుకున్నంత మాత్రాన మళ్లీ ఇరాన్ యుద్ధం మొదలవుతుందని అర్థం కాదని ట్రంప్ స్పష్టం చేశారు.

Read Also: KL Rahul Emotional: పాపం కేఎల్ రాహుల్.. ఆరెంజ్ క్యాప్ వచ్చినా కనపడని ఆనందం..

“కొద్దిసేపటి క్రితం నా సిబ్బంది బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. మీరు అక్కడికి వెళ్లడానికి 18 గంటల విమాన ప్రయాణం చేయనవసరం లేదు అని చెప్పా. అన్ని అవకాశాలు మన చేతిలోనే ఉన్నాయి. వారు ఎప్పుడైనా మాకు ఫోన్ చేయవచ్చు, కానీ పనికిరాని విషయాల గురించి మాట్లాడుకుంటూ కూర్చోవడానికి మీరు ఇకపై 18 గంటల విమాన ప్రయాణాలు చేయబోరు అని చెప్పాను,” అని ట్రంప్ అన్నారు.

మరోవైపు, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌లతో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ సమావేశయ్యారు. దీని తర్వాత ఆయన, అతడి ప్రతినిధి బృందం ఇరాన్ వెళ్లిపోయింది. అమెరికాతో నేరుగా చర్చలు జరపకుండానే ఇరాన్ ప్రతినిధులు టెహ్రాన్ బాట పట్టారు. యూఎస్‌తో నేరుగా చర్చించేందుకు ఇరాన్ నాయకత్వం సుముకంగా లేదని తెలుస్తోంది.