
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం భారీగా ఐఏఎస్లను బదిలీ చేసింది. 13 మంది ఐఏఎస్లను బదిలీ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య, ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సీఈవోగా హనుమంతు, ఆర్అండ్బీ స్పెషల్ సెక్రటరీగా ప్రవీణ్య, ట్రైబల్ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీగా సంతోష్, ఇంటర్ బోర్డ్ సెక్రటరీగా అభిలాష్ అభినవ్, పంచాయతీ రాజ్ స్పెషల్ సీఎస్గా దాన కిషోర్, సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీగా విజయేంద్ర, ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్గా సంజయ్ కుమార్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.