
కర్ణాటక తీరప్రాంతం ఉడిపి సమీపంలో ఉండే మణిపాల్ అంటే అందరికీ గుర్తొచ్చేది మణిపాల్ యూనివర్సిటీ. మణిపాల్ టౌన్ అంటే చదువులకే కేరాఫ్ అడ్రస్ అనే పేరుంది. అలాంటి పట్టణంలో ఒక జంట రోడ్డుపై చేసిన పనికి సోషల్ మీడియా రియాక్ట్ అయిన విధానం వైరల్ గా మారింది. రోడ్డుపై ఏంది సామీ ఇది.. పబ్లిక్ ప్లేస్ లో ఏందిరా నాయనా ఇది.. అంటూ గట్టిగా ఏసుకుంటున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. మణిపాల్‌లో ఒక జంట రోడ్డు పక్కన నిలబడి డీప్ కిస్సింగ్ లో ఇన్వాల్వ్ అయిపోయారు. ఈ వీడియో వైరల్ గా మారింది. దీంతో ఇది ప్రేమా? లేదా కేవలం కామమా? అంటూ సోషల్ మీడియా అంతా రగిలిపోయింది. రోడ్డుపైన వాళ్లు చేస్తున్న పని చూసి అందరూ.. అయ్యో.. ఛీఛీ.. సిగ్గులేదు వీళ్లకి.. చూడకుండా ఉంటే మనకే బెటర్.. ఎవరి ఇష్టం వాళ్లది.. అని ఒక్కొక్కరు ఒక్కో రియాక్షన్ తో వెళ్లిపోయారు.
కానీ ఒక వ్యక్తి మాత్రం వారిని కొశ్చన్ చేశాడు. కన్నడంలో పబ్లిక్ కు ఇబ్బంది కలుగుతుందనే ఆలోచన కూడా లేదా మీకు.. అంటూ ప్రశ్నించాడు. దీంతో హిందీలో మాట్లాడమని అడిగారు. కొద్దిసేపు వాదన తర్వాత ఆ జంట అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ వీడియో వైరల్ కావడంతో ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఒకే ప్రశ్న.. పబ్లిక్‌లో ఇలాంటి PDA అంటే పబ్లిక్ డిస్‌ప్లే ఆఫ్ అఫెక్షన్ కరెక్టేనా? అంటూ కొదరు కొశ్చన్ చేస్తున్నారు.
ఇది ప్రేమ కాదు, కేవలం లస్ట్ మాత్రమే! కుటుంబాలు, విద్యార్థులు తిరిగే ప్రాంతంలో ఇలా చేయడం సరికాదు అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇది ఇద్దరు మేజర్ల పరస్పర అంగీకారంతో జరిగే విషయం. సమాజాంలో ఇంతకంటే ఎన్నో సమస్యలున్నాయి. నిజమైన సమస్యలపై మీరు ఎందుకు గళం ఎత్తడం లేదు? ఇది మోరల్ పోలీసింగ్ కాదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది పాత ఆలోచనలకు, మోడ్రన్ సొసైటీకి మధ్య జరుగుతున్న వివాదం అంటూ కొందరు ట్వీట్ చేస్తున్నారు. మరి ఈ ఘటనపై మీరేమంటారు..?
Shocking & unacceptable! A couple caught indulging in highly indecent behavior in public in Manipal. This is not PDA, this is openly disrespecting Indian culture, public decency, and the people around.
Manipal is an education hub students & families deserve better. Where are the… pic.twitter.com/8zJ9n9AsLo— ಸನಾತನ (सनातन) (@sanatan_kannada) April 24, 2026