Reading Time: < 1 minute

PEDDI: ‘పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా’.. ట్రెండింగ్లో ‘పెద్ది’ సెకండ్ సింగిల్ లిరిక్స్..

Caption of Image.

రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన రూపొందిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఇప్పటికే మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన టీమ్.. ‘చికిరి చికిరి’ సాంగ్‌‌‌‌తో  ట్రెండ్ సృష్టించారు. సోమవారం (MARCH 3న) సెకండ్ సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ తరహాలోనే ఈ పాటకు కూడా ఏఆర్ రెహమాన్ తనదైన సంగీతంతో అలరించారు. ఆయనే స్వయంగా ఆలపించారు.

‘పాతేసుకో ఓ కోయలా.. ఉండే నీ లోపల.. ఏ పాతికేళ్లకే నువ్వు పాతబడిపోకురా.. రై రై రా రా..’ అంటూ సాగిన పాటలో రామ్ చరణ్ రగ్డ్ లుక్‌‌‌‌లో ఇంప్రెస్ చేస్తున్నాడు. ‘నిన్నటి లాగే రేపున్నదంటే ఈరోజు ఏం పీకావనే.. నీ అయ్య వడ్డీ నీ బిడ్డ కడితే నువ్వేమి పొడిచావనే.. ఆటనుకోకోయ్.. ఆటంటే బతుకోయ్.. నీ ఆట బతకాలిరోయ్.. మండే గుండే నీలో లేదంటే.. కాలు చెయ్యి ఉన్నా లేనట్టే‘ అంటూ అనంత శ్రీరామ్ యువతలో స్ఫూర్తినింపే లిరిక్స్ రాశారు. ‘చిరుత’ని గుర్తు చేసేలా జానీ మాస్టర్ డ్యాన్స్ బీట్స్ అందించారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది.

జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో శివ రాజ్‌‌‌‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ, బోమన్ ఇరానీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌‌‌‌‌పై  వెంకట సతీష్ కిలారు  నిర్మిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది.

©️ VIL Media Pvt Ltd.