Reading Time: < 1 minute

వికారాబాద్ లో మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

Caption of Image.

వికారాబాద్ జిల్లా  కేంద్రంలో  విషాదం చోటుచేసుకుంది. పట్టణంలోని  గంగారం సాయిబాబా కాలనీలో మహిళా పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడింది. ఫిబ్రవరి 27న రాత్రి మహిళా కానిస్టేబుల్ దివ్య  ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. 

కోటపల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తూ దారూర్ సీఐ కార్యాలయానికి అటాచ్‌గా పనిచేస్తున్న మహిళా పోలీస్ కానిస్టేబుల్ బలిజ దివ్య తన నివాసంలో ఉరివేసుకుని మృతి చెందింది. కుటుంబ సభ్యులు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.  ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ ఆత్మహత్యకు కుటుంబ కలహాలా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

©️ VIL Media Pvt Ltd.