Reading Time: < 1 minute
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి

సిఖియో జిల్లాలో ప్రస్తుతం హైస్పీడ్ రైలు ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనుల్లో వినియోగిస్తున్న ఒక భారీ క్రేన్ బుధవారం ఉదయం అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కింద ఉన్న పట్టాలపై జారిపడింది. దురదృష్టవశాత్తు అదే సమయంలో పట్టాలపై నుంచి ప్రయాణికులతో నిండిన రైలు వెళ్తోంది. ఎత్తు నుంచి పడిన క్రేన్ ధాటికి రైలు బోగీలు తునాతునకలు అయ్యాయి. క్షణాల్లోనే ఆ ప్రాంతమంతా రక్తసిక్తమైంది. క్రేన్ ధాటికి బోగీలు పట్టాలు తప్పడమే కాకుండా పెట్రోల్ ట్యాంకులు పేలి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు ప్రాణభయంతో అల్లాడిపోయారు. ఈ భీకర ప్రమాదంలో ఇప్పటివరకు 22 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 30 మంది మృత్యువుతో పోరాడుతున్నారు. క్రేన్ పడిన వేగానికి రైలు బోగీలు పట్టాలు తప్పడమే కాకుండా కొన్ని బోగీల్లో మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో రైలులో చాలామంది ప్రయాణికులు ఉన్నారు.