Reading Time: 2 minutes
ఆ టైంలో ఆస్తులన్నీ అమ్ముకున్నాం.. ఇండస్ట్రీ నుంచి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు..

నటుడు ఆకాష్ పూరి, తన కుటుంబం ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక కష్టాలను, ముఖ్యంగా తన తండ్రి, ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ జీవితంలో ఎదురైన క్లిష్టమైన దశ గురుంచి గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ  ఇంటర్వ్యూలో ఫ్యామిలీ స్ట్రగుల్స్ గురించి మాట్లాడుతూ, చిన్నతనంలో తాను, తన కుటుంబం అనుభవించిన వేదనను పంచుకున్నారు. ఆకాష్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తున్నారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా పరిశ్రమలోకి ప్రవేశించి దాదాపు 16, 17 సంవత్సరాలకు పైగానే అయ్యింది. తన తండ్రి సినిమా కెరీర్‌లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారని ఆకాష్ పేర్కొన్నారు. అయితే, ఒకానొక సమయంలో పూరి జగన్నాథ్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయారని, ఆ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, కుక్కలకు ఆహారం పెట్టలేని స్థితికి కూడా చేరుకున్నారని ఆకాష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ రోజుల్లో పూరి తన స్నేహితులకు ఫోన్ చేసి, తన పెంపుడు కుక్కలను తీసుకెళ్లమని కోరాల్సి వచ్చిందని, ఈ విషయాన్ని స్వయంగా పూరి జగన్నాథ్ బహిరంగంగా చెప్పారని ఆకాష్ గుర్తు చేసుకున్నారు.

నేను మాట్లాడిన మాట ప్రజల్లోకి వల్గర్‌గా వెళ్ళింది.. నా వల్ల ఆ స్టార్ డైరెక్టర్ మాటలు పడ్డారు..

ఆ క్లిష్ట సమయంలో సినిమా పరిశ్రమలో ఉన్నవారు కూడా పూరి జగన్నాథ్‌కు అండగా నిలబడలేదని, ఆయన ఒంటరిగా మిగిలిపోయారని ఆకాష్ తెలిపారు. తన తల్లి ఈ పరిస్థితిని అర్థం చేసుకుని, తాము చిన్నపిల్లలం కాబట్టి ఈ కష్టాలు తెలియకూడదని భావించి, తనను (ఆకాష్‌ను) అలాగే తన చెల్లిని హాస్టల్‌లో చేర్పించినట్లు వివరించారు. ఆ సమయంలో ఆకాష్ మూడో తరగతిలో ఉండగా, అతని చెల్లి రెండో తరగతిలో ఉంది. హాస్టల్‌లో ఉన్నప్పుడు తమకు ఏమీ తెలియలేదని, తమ నాన్న పెద్ద డైరెక్టర్ అని, అంతా హ్యాపీగా ఉందని భావించామని ఆకాష్ చెప్పారు.

Anand Deverakonda: అసలు ఎపిక్ సినిమా అంటే అదే.. ఆ సీన్‌లో కన్నీళ్లు పెట్టుకున్నా: ఆనంద్ దేవరకొండ

కొన్నాళ్ల తర్వాత హాస్టల్ నుంచి తిరిగి ఇంటికి వచ్చాక, పరిస్థితి పూర్తిగా మారిపోయిందని ఆకాష్ అన్నారు. “అన్నీ మారిపోయాయి. మేమే వేసుకునే బట్టల నుంచి, తినే ఫుడ్ నుంచి, ఉంటున్న ప్లేస్ అన్నీ అన్నీ మారిపోయాయి” అని ఆకాష్ పేర్కొన్నారు. సుమారు ఐదు, ఆరు సంవత్సరాలు తమ జీవితం చాలా నరకంగా గడిచిందని, అప్పట్లో తాము ఉన్న ఇల్లును, కార్లును కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. ఒకప్పుడు తమ వద్ద రెండు మూడు కార్లు ఉండేవని, వాటిని చూసి ప్రజలు ఈయనకేం తక్కువ అనేవారని, కానీ ఆ సమయంలో పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవని ఆకాష్ పంచుకున్నారు. తన తండ్రి ఆ కష్టాల నుంచి తిరిగి రాకపోయుంటే, తాను బహుశా నేడు “నెపోకిడ్” అనే మాట వినకుండా, ఫోటోలు పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరిగే ఒక సాధారణ స్ట్రగులింగ్ నటుడిగానే ఉండేవాడినని ఆకాష్ అభిప్రాయపడ్డారు. అయితే, తన తండ్రి మళ్లీ తిరిగి నిలబడటం ఒక అద్భుతమని, అది నమ్మశక్యం కాని విషయమని అన్నారు.

ఆ సినిమా ఫ్లాప్ అవుతుందనుకోలేదు.. ఆ దెబ్బకు 3 నెలలు ఇంట్లో నుంచి బయటకు రాలేదు

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.