Reading Time: < 1 minute

హోటళ్లు, రెస్టారెంట్లకు షాక్.. పెరిగిన కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లు

Caption of Image.

సెప్టెంబర్ 1న గ్యాస్ వినియోగదారులకు మోడీ సర్కార్   షాక్ ఇచ్చాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.9.50 మేర పెంచుతున్నట్లు ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఈ కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. గత 2 నెలలుగా ధరలు తగ్గినప్పటికీ.. ఇప్పుడు మళ్లీ గ్యాస్ రేట్లు పెరగడం వ్యాపార వర్గాలను కలవరపెడుతోంది. దీంతో హైదరాబాదులో 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2వేల 996కి చేరింది. అయితే సామాన్య ప్రజలు వాడే డొమెస్టిక్ సిలిండర్ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. 

పశ్చిమాసియా ప్రభావం..
ఈ గ్యాస్ ధరల పెంపు వెనుక అంతర్జాతీయ పరిణామాలు, ప్రభుత్వ వ్యూహాలు ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారతదేశం దిగుమతి చేసుకునే ఇంధనంపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే.. దేశీయంగా గ్యాస్ సరఫరా బఫర్‌ను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం గత వారమే రిఫైనరీలకు ప్రత్యేక ఎల్పీజీ ఉత్పత్తి లక్ష్యాలను నిర్దేశించింది. విదేశీ ఇంధన మార్కెట్ల ఒత్తిడి నుంచి దేశాన్ని రక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 

సీఎన్జీ, పీఎన్జీ ధరల పెంపు..
మహానగర్ గ్యాస్ లిమిటెడ్ ముంబై నగరంలో CNG, PNG రేట్లు పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అంతర్జాతీయ పరిణామాల కారణంగా గ్యాస్ ధరలు భారీగా పెరిగినట్లు సంస్థ తెలిపింది. ఈ ఇబ్బందికర పరిస్థితుల వల్లే ధరలను సవరించాల్సి వచ్చిందని కంపెనీ స్పష్టం చేసింది.

©️ VIL Media Pvt Ltd.