Reading Time: < 1 minute

కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు

Caption of Image.

రైల్వే మంత్రిత్వశాఖ పరిధిలోని నవరత్న కంపెనీ అయిన కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీఓఎన్​సీఓఆర్) వివిధ విభాగాల్లో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రైనీ (ఎంటీ), అసిస్టెంట్ ఆఫీసర్ (ఏఓ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఆసక్తి గల అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అప్లై చేసుకోవచ్చు. 

పోస్టు పేరు: మేనేజ్​మెంట్ ట్రైనీ & అసిస్టెంట్ ఆఫీసర్. 

మొత్తం ఖాళీలు: 77.
విభాగాల వారీగా ఖాళీలు

మేనేజ్​మెంట్ ట్రైనీ: సీ & ఓ 25, అకౌంట్స్ 09, అకౌంట్స్/ కంప్లైయన్స్ 01, టెక్నికల్ 04, ఎంఐఎస్ 03, సివిల్ 02, పీ & ఏ 02.
అసిస్టెంట్ ఆఫీసర్:  సీ & ఓ 20, అకౌంట్స్ 02, టెక్నికల్ 04, ఎంఐఎస్ 03, సివిల్ 03.

విద్యార్హతలు

మేనేజ్ మెంట్ ట్రైనీ: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత స్టీముల్లో డిగ్రీ, ఇంజినీరింగ్ (బీఈ/ బి.టెక్), పీజీ, ఎంబీఏ లేదా సీఏ/ సీఎంఏ వంటి ప్రొఫెషనల్ అర్హతలు ఉండాలి.
అసిస్టెంట్ ఆఫీసర్: సంబంధిత స్టీముల్లో డిగ్రీ లేదా సమాన ప్రొఫెషనల్ అర్హతలు కలిగి ఉండాలి.

వయోపరిమితి 

మేనేజ్​మెంట్ ట్రైనీ పోస్టులకు 18 నుంచి28 ఏళ్ల మధ్యలో  ఉండాలి. 
అసిస్టెంట్ ఆఫీసర్ (ఏఓ) పోస్టులకు18 నుంచి32 ఏళ్ల మధ్యలోఉండాలి.
కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఇతర రిజర్వుడ్ వర్గాల అభ్యర్థులకు వయసు సడలింపు వర్తిస్తుంది.
అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా.
: అప్లికేషన్ ప్రారంభం ఆగస్టు 31.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 30. 
మరిన్ని వివరాలకు వెబ్ సైట్ concorindia.co.inను సందర్శించండి. 

©️ VIL Media Pvt Ltd.