Reading Time: 2 minutes
డెలాయిట్, అమెజాన్‌లో జాబ్స్ వదులుకుని సినిమాల్లోకి.. ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో.. ఎవరో గుర్తు పట్టారా?

పై ఫొటోలో ఉన్న కుర్రాడిని గుర్తు పట్టారా? అతను ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో పుట్టి పెరిగాడు. పుట్టపర్తిలో చదువుకున్నాడు. అమెరికా, న్యూయార్క్ లోని టాప్ యూనివర్సిటీల్లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఆ తర్వాత జీఎంఆర్ ఏరో టెక్నిక్, హైదరాబాద్ అమెజాన్ డెవలప్ మెంట్ సెంటర్, చికాలోని డెలాయిట్ వంటి టాప్ మల్టీ నేషనల్ కంపెనీల్లో వివిధ హోదాల్లో పనిచేశాడు. అయితే నటనపై ఇంట్రెస్ట్ ఉండడంతో లక్షల జీతం, లగ్జరీ లైఫ్ వదులుకుని సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. 2019లో సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఇతను ఇప్పటిదాకా ఓ 6-7 సినిమాలు చేశాడు. అందులో దాదాపు ప్రతి సినిమా బాగానే ఆడింది. ఒక సినిమా అయితే ఏకంగా 100 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. కమర్షియల్ సినిమాలకు కాస్త దూరంగానే ఉండే హీరో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో తన సొంత అన్నయ్య ఫేమస్ హీరో అయినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోన్న అతను మరెవరో కాదు ఆనంద్ దేవరకొండ.

ఇవాళ (మార్చి 15) ఆనంద్ దేవరకొండ పుట్టిన రోజు. ఈ నేపథ్యంలో ఈ టాలీవుడ్ హీరోకు పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఇదే క్రమంలో ఆనంద్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు, త్రో బ్యాక్ ఫొటోస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. కాగా బేబీతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఆనంద దేవరకొండ చివరిగా గం గం గణేశా అనే సినిమాలో హీరోగా నటించాడు.

విజయ్ దేవరకొండ పెళ్లిలో ఆనంద్ దేవరకొండ..

 

View this post on Instagram

 

A post shared by Anand Deverakonda (@ananddeverakonda)

ప్రస్తుతం ఎపిక్ అనే సినిమాతో బిజీ బిజీగా ఉంటున్నాడీ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో. ‘90స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సిరీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫేమ్ ఆదిత్య హసన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రూపొందిస్తున్న ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా యాక్ట్ చేస్తోంది. బేబీ తర్వాత ఆనంద్ దేవరకొండ- వైష్ణవి కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Anand Deverakonda (@ananddeverakonda)

 

View this post on Instagram

 

A post shared by Anand Deverakonda (@ananddeverakonda)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.