
టాలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్స్ విజయ్-రష్మికల పెళ్లి సంబరాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.పెళ్లి అయిపోయి (ఫిబ్రవరి26) ఆరు రోజులు అవుతున్నప్పటికీ.. వరుస ఈవెంట్స్తో జోష్ పెంచుతున్నారు.
ఉదయ్ పూర్ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత.. విరోష్ జంట స్వీట్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలు, వ్రతాలు, పూజలు చేస్తూ ట్రెండింగ్లో నిలుస్తూ వస్తున్నారు.
ఈ క్రమంలోనే విరోష్ జంట ఇవాళ (మార్చి 3న).. పెళ్లికు ముందు నిర్వహించిన సంగీత్ వేడుక ఫోటోలు షేర్ చేశారు. ఇపుడు ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.
విజయ్ రష్మికల క్రేజీ డ్యాన్స్తో పాటుగా రాయల్ లుక్ రొమాంటిక్ ఫొటోస్ ఆకట్టుకుంటున్నాయి. ఒక వీడియోలో విజయ్.. రష్మికను లిఫ్ట్ చేసి ఫ్లోర్‌పై చేసే రొమాంటిక్ డ్యాన్స్ అదిరిపోయింది. మరో ఫోటోలో రష్మిక తన ఫ్యామిలీకి ఫ్లైయింగ్ కిస్ ఇస్తుండగా, విజయ్ అరవోకగా నవ్వుతూ ఆమెను చూడడం క్యూట్గా ఉంది.
రష్మిక తన మరిది ఆనంద్ దేవరకొండతోనూ కలిసిస్టెప్పులు వేస్తూ సందడి చేసింది. మొదట ఆనంద్‌తో కలిసి రష్మిక స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చి అందరినీ అలరించింది. ఆ తర్వాత తన ప్రేయసి రష్మిక కోసం విజయ్ దేవరకొండ స్పెషల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఆ తర్వాత విజయ్–రష్మిక కలిసి ఒక రొమాంటిక్ సాంగ్‌కు అదిరిపోయేలా డ్యాన్స్ చేసి వేడుకకు మరింత హైలైట్ తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
అలాగే, విజయ్ రష్మిక జంట తమ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో ఉన్న సన్నివేశాలు, ఎమోషనల్ స్పీచెస్.. సైతం ఆకట్టుకుంటున్నాయి. ఇలా అన్ని కలిసిన సంగీత్ వేడుక ఒక బ్యూటీఫుల్ ఈవెంట్గా నిలిచిందని విజయ్ ఫోటోలు పంచుకున్నారు.
24.02.26
Our Sangeeth night.
The evening that was spent laughing till we had tears, dancing till the arches of our feet hurt, swallowing emotions to everyones speeches and surprises till our eyes were leaking.
Was a big happy party filled with beautiful people ❤️ pic.twitter.com/50aJvBHxQN
— Vijay Deverakonda (@TheDeverakonda) March 3, 2026
ఆ అద్భుతమైన రాత్రిని గుర్తుచేసుకుంటూ, రష్మిక మందన్న కూడా ఫోటోలు షేర్ చేసింది.‘‘ప్రేమ, ఆనంద కన్నీళ్లు, నవ్వు, సంగీతం, సింగింగ్, డ్యాన్సులు.. ఇలా అన్నీ మెరుపులతో నిండిన రాత్రి’’ అని రష్మిక క్యాప్షన్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. విజయ్ రష్మిక జంట ఈ సంగీత్ కోసం ఫల్గుణి షేన్ పీకాక్ డిజైనర్‌లు చేసిన దుస్తులను ధరించారు. విజయ్ ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. “@falgunishanepeacock వారి అద్భుతమైన డిజైనింగ్ దుస్తులతో మాయాజాలం చేశారు” అని తెలిపారు. రష్మిక ఐవరీ లెహంగా, భారీ ఎంబ్రాయిడరీతో బ్యూటీ ఇంప్రెస్ చేసింది. విజయ్ – రాయల్ బ్లూ షెర్వాని, గోల్డ్ ఎంబ్రాయిడరతో రాజసంగా కనిపించాడు.
హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్
‘విరోష్’ జోడీ మార్చి 4వ తేదీ సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు పంపించారు. ఇక ఈ రిసెప్షన్‌కు టాలీవుడ్ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉండటంతో, హైదరాబాద్‌లో ఈ వేడుక హాట్ టాపిక్‌గా మారింది.
Hi my loves,
Introducing to you now “My Husband”! 💘
Mr. Vijay Deverakonda!! ❤️
The man who taught me what true love feels like,
The man who showed me what being in peace feels like! 🤍
The man who told me everyday that dreaming big was absolutely ok and constantly telling… pic.twitter.com/MPrsGfNTwb— Rashmika Mandanna (@iamRashmika) February 26, 2026