Reading Time: < 1 minute
Rakhi Sawant Comments On Vijay Trisha Marriage Rumors

తమిళనాడు రాజకీయాల్లో పెను మార్పులు తెస్తూ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న దళపతి విజయ్ గురించి నిత్యం ఏదో ఒక వార్త వైరల్ అవుతూనే ఉంది. అయితే, గత కొంతకాలంగా విజయ్, నటి త్రిష మధ్య ఏదో సాగుతోందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికారు చేస్తున్నాయి. వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. తాజాగా ఈ రూమర్స్ పై బాలీవుడ్ నటి రాఖీ సావంత్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

‘విజయ్-త్రిష జోడీ చూడటానికి చాలా బాగుంటుంది. వారిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని నాకు ఉంది. ఒకవేళ అది నిజమైతే, వారి మెహందీ ఫంక్షన్‌లో నేను ప్రత్యేకంగా డాన్స్ చేసి సందడి చేస్తా’ అని రాఖీ చెప్పుకొచ్చింది. త్రిష తనకు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే తెలుసని, ఇద్దరం కలిసి స్ట్రగుల్ అయ్యామని ఆమె గుర్తు చేసుకుంది. అంతేకాకుండా, విజయ్ పక్కన ఒక్క పాటలోనైనా నటించాలని తనకు కోరిక ఉండేదని, కానీ ఆ ఛాన్స్ రాలేదని.. కనీసం వారి పెళ్లి వేడుకలోనైనా తన కల నెరవేర్చుకుంటానని రాఖీ సావంత్ వ్యాఖ్యానించింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ కోలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.