
ఇరాన్ సంక్షోభం, పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌తో యుద్ధం వెంటనే ముగిసే అవకాశాలు లేవని, మరో ఐదు నుంచి ఆరు వారాల పాటు కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని ప్రకటించారు. ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్, సైన్యం ఆయుధాలు విడిచిపెడితే రక్షణ కల్పిస్తామన్నారు. ఇరాన్ దీర్ఘశ్రేణి ఆయుధాలు కలిగి ఉండడం పశ్చిమాసియాతో పాటు అమెరికాకు పెనుముప్పు అని ట్రంప్ హెచ్చరించారు.ఆపరేషన్ ‘ఎపిక్ ప్యూరీ’ సంపూర్ణ స్థాయిలో కొనసాగుతోందన్నారు. ఖమేనీ ప్రమేయంతో తనపై ఎన్నోసార్లు హత్యాయత్నాలు జరిగాయని ట్రంప్ ఆరోపించారు. ఇప్పటి వరకు యుద్ధంలో నలుగురు తమ సైనికులు మరణించారని
అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్‌సెథ్ వెల్లడించారు. ఇరాన్ ఆయుధాలు తయారు చేస్తూ ప్రాంతీయంగా ఉద్రిక్తతలకు దారి తీసిందన్నారు. అణ్వాయుధ బెదిరింపులకు కూడా వెనకాడలేదన్నారు. యుద్ధాన్ని తాము మొదలు పెట్టామని, తామే ముగింపు పలుకుతానమని పీటర్ తెలిపారు. ఇరాన్‌లో పాలనను చేజిక్కించుకుకునేందుకు తాము యుద్ధానికి పాల్పడడం లేదని, అలాంటి ఉద్దేశం తమకు లేదన్నారు. యుద్ధ కారణంగా జరిగే నష్టం ఇరువైపులా ఏ రకంగా ఉంటుందో అధ్యక్షుడు ట్రంప్‌కు పూర్తి అవగాహన ఉందన్నారు. అణ్వాయుధాలు వీడాలని సూచిస్తే ఖమేనీ పెడచెవిన పెట్టడమే కాకుండా ఎవరో ఒకరు బ్రతికుండాలన్నట్టుగా మాట్లాడారని, చివరకు అతనే యుద్ధం మృత్యువాతపడ్డారని అన్నారు.