
మెల్‌బోర్న్ : 2029 వరకు కనిపించని చివరి చంద్రగ్రహణం మంగళవారం దర్శనం ఇవ్వనుంది. తదుపరి చంద్రగ్రహణం 2028 డిసెంబర్31 2029 జనవరి1న దర్శనం ఇవ్వనుంది. భారత దేశంలో సాయంత్రం 3.20 గంటలకు ప్రారంభమై 6.46 గంటలకు ముగుస్తుంది. ఆస్ట్రేలియా, అయోటిఅరోయా న్యూజిలాండ్‌ల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి బ్లడ్‌మూన్ అని పిలుస్తారు. హోలీ పండగ రోజున ఈ గ్రహణం ఏర్పడుతుండడం విశేషం. భూమి ఛాయ లోకి చంద్రుడు చేరడానికి 75 నిమిషాలు పడుతుందని, దానిని పాక్షిక గ్రహణ దశ అంటారని, చంద్రుడు పూర్తిగా ఎర్రబడడానికి గంట సమయం పడుతుందని
మరో 75 నిమిషాల తరువాత ఛాయ నుంచి చంద్రుడు బయట పడి పూర్తి వికాసంతో ప్రకాశిస్తాడని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. భారత దేశంలో ముఖ్యంగా తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో సాయంత్రం వేళ చంద్రోదయ సమయంలో కనిపిస్తుంది. పశ్చిమ ఆస్ట్రేలియా లోని చాలా ప్రాంతాల్లో గ్రహణం చంద్రుడు దిగ్మండలం కింద ఉండటంతో ప్రారంభమవుతుంది. ఆస్ట్రేలియా మినహా మిగతా ప్రాంతాల్లో గ్రహణం సాయంత్రం ప్రారంభమవుతుంది. న్యూజిలాండ్‌లో రాత్రి 10.50 కి గ్రహణం ప్రారంభం కానుంది. తదుపరి రక్త చంద్రుడ్ని దర్శించడానికి మూడేళ్లు నిరీక్షించవలసి ఉన్నందున మంగళవారం సాయంత్రం గ్రహణం స్పష్టంగా కనిపించేలా ఆకాశం నిర్మలంగా ఉంటుందని నిరీక్షిస్తున్నారు.