Reading Time: 2 minutes
Kerala Renamed As Keralam History Mythology Reasons Behind Name Change

Kerala Rename: కేరళ రాష్ట్రం పేరును ‘‘కేరళమ్’’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎన్నో ఎళ్లుగా కేరళ ప్రజల కల ఈ రోజుతో నెరవేరింది. కేరళను ఎందుకు కేరళమ్‌గా మార్చారని చాలా మంది ఆసక్తి కనబరుస్తున్నారు. దీనికి అనేక చారిత్రక కారణాలు కూడా ఉన్నాయి. జూన్ 24, 2024న కేరళ రాష్ట్ర అసెంబ్లీ తమ రాష్ట్రం పేరును ‘‘కేరళమ్’’గా మార్చాలని ఒక తీర్మానాన్ని పాస్ చేశాయి. భాషా ప్రతిపదికన నవంబర్ 1, 1956లో ఏర్పడిన రాష్ట్రాల్లో మలయాళం మాట్లాడే కేరళ కూడా ఒకటి. ఆ సమయంలోనే రాజ్యాంగంలోని మొదటి షెడ్యూల్‌లో ‘‘కేరళ’’గా రాష్ట్రం పేరును రాశారు. నిజానికి మలయాళంలో రాష్ట్రం పేరును ‘‘కేరళమ్’’గా పిలుస్తారు. కానీ ఇంగ్లీషులో కేరళగా పిలుస్తారు.

పరుశురాముడి కథ:

విష్ణువు యొక్క ఆరో అవతరామైన పరశురాముడికి కేరళకు ప్రత్యక్ష సంబంధం ఉంది. దుష్ట క్షత్రియుల్ని అంతం చేసిన తర్వాత, పరశురాముడు భారీ యజ్ఞం చేశాడు. ఈ యజ్ఞంలో తాను గెలుచుకున్న భూమిని మొత్తం శివుడికి దానం ఇస్తాడు. తన భూమినంతా దానం చేసిన తర్వాత, పరశురాముడు తపస్సు, ఇతర ఆచారాల కోసం కొంత భూమిని కోరుతాడు. దానం చేసినదాంట్లో ఏలాంటి భూమిని కూడా తీసుకోలేకపోయాడు.

అదే సమయంలో వరణుడు పరశురాముడిని సముద్ర తీరానికి తీసుకెళ్లి.. ‘‘నీరు కావాల్సిన భూమి తీసుకో. అంత వరకు సముద్రం వెనక్కి వెళ్లి భూమి వస్తుంది’’ అని చెబుతాడు. పరశురాముడు తన గొడ్డలిని విసిరిన తర్వాత సముద్రం నుంచి భూమి బయటకు వస్తుంది. ఈ ప్రదేశమే నేటి కేరళగా చెబతారు. మలయాళంలో కేర అంటే నీరు, ఆలం అంటే భూమి. నీటి నుంచి ఉద్భవించిన భూమి అని అర్థంగా కేరళమ్ అని పిలుస్తారు.

అశోకుడి శిలాశాసనం:

చరిత్ర ఆధారాలను పరిశీలిస్తే, క్రీస్తుపూర్వం 3వ శతాబ్ధానికి చెందిన మౌర్య చక్రవర్తి అశోకుడు తన శిలాశాసనాల్లో ఈ ప్రాంతాన్ని ‘‘కేరళపుత్ర’’ అని సంబోధించారు. అంటే కేరళ పాలకుడు అని అర్థం

చేర వంశం నుంచి కేరళమ్:

దక్షిణ భారత చరిత్రకారులు ‘‘కేరళమ్’’ అనే పేరును చేర వంశంతో ముడిపెడుతున్నారు. ఈ ప్రాంతాన్ని పాలించిన చేర వంశం ఆధారంగా పేరు వచ్చినట్లు చెబుతున్నారు. చేర పేరు నుంచి ‘‘చేరళం’’గా ఉద్భవించి, కాలక్రమేణా ఇది ‘‘కేరళమ్’’గా మారినట్లు చెబుతారు. ద్రావిడ భాషల్లో క,చ అక్షరాలు మారుతుంటాయి.

కొబ్బరి చెట్ల భూమి:

కేరళలో అంటేనే కొబ్బరి చెట్లు గుర్తుకు వస్తాయి. మలయాళంలో ‘కేర’ అంటే కొబ్బరి చెట్లు అని అర్థం. ‘అలం’’ అంటే స్థలం అని అర్థం. దీని ద్వారా కొబ్బరి చెట్ల నేలగా ‘‘కేరళమ్’’ అనే పేరు రావచ్చని చెబుతున్నారు. ఇది భౌగోళిక ప్రాముఖ్యతను కలిగి ఉంది.