Reading Time: < 1 minute
Minister Anagani Satya Prasad Alleges %e2%82%b96000 Crore Housing Scam During Ycp Rule

Anagani Satya Prasad: వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పాలనా కాలంలో పేదలందరికీ ఇళ్లు పేరుతో 6 వేల కోట్ల రూపాయాల కుంభకోణాలకు పాల్పడ్డారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు.. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ గత ప్రభుత్వం 22 లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే అందులో 7 లక్షల మంది కన్వేయన్స్ డీడ్ లు. తీసుకోలేదన్నారు మంత్రి అనగాని… ఇళ్ల పట్టాల కోసం నివాస యోగ్యం కాని పల్లపు భూములు, శ్మశానాలు, ఊరికి దూరంగా ఉండే భూములు, వర్షాలకు మునిగి పోయే భూములను రెండింతలు, మూడింతలు అధిక రేట్లు ఇచ్చి సేకరించరాని చెప్పారు. ఇళ్ల పట్టాలు నివాసయోగ్యంగా లేని కారణంగా రెండున్నర లక్షల మంది ఇళ్ల పట్టాలు తీసుకునేందుకు నిరాకరించారని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారని, తమ ప్రభుత్వం విచారణ చేయించగా 43,948 మంది అనర్హులు తేలినట్లు చెప్పారు. పరిశీలనలో ఇంకా 1, లక్షా 11 వేల 37 మంది… లబ్దిదారులు ఉన్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇళ్లు పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అయితే గత ప్రభుత్వం సెంటున్నర, సెంటు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మొత్తం 4,లక్షల..8,వేల. 876 దరఖాస్తులు ఇళ్ల పట్టాల కోసం వచ్చాయన్నారు…

Read Also: Made in Korea : మార్చి 12న నెట్‌ఫ్లిక్స్ లో ‘మేడ్ ఇన్ కొరియా’