Reading Time: < 1 minute

మన తెలంగాణ/జైనథ్ : ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండల కేంద్రంలో అతి పురాతనమైన ఆలయం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం, శ్రీ లక్ష్మీ నారాయణస్వామి ఆలయంలో అద్భుతం చోటుచేసుకుంది. సోమవారం తెల్లవారుజామున సూర్యకిరణాలు నేరుగా స్వామివారి పాదాలపై పడడం జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. సోమవారం నుండి వారం రోజులపాటు సూర్యకిరణాలు స్వామివారి పాదాలపై పడటం జరుగుతుందని చెప్పారు అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు.