Reading Time: < 1 minute

లక్నో: ఐదో తరగతి విద్యార్థిని అనుమానాస్పదంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లాలోని ఛకేరీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. రాధేనగర్‌లో 11 ఏళ్ల విద్యార్థిని ఐదో తరగతి చదువుతోంది. బాలిక చదువును ఆశ్రద్ధ చేస్తూ ఫోన్‌లో స్నేహితులతో చాటింగ్ చేస్తుండడంతో ఆమెపై తల్లి పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసింది. మంచి చదువుకోవాలని పలుమార్లు కూతురుకు సూచించిన కూడా ఆమెలో మార్పు రాలేదు. శనివారం 11 గంటలకు స్కూల్ నుంచి ఇంటికి బాలిక వచ్చింది. తన సోదరులతో ఆమె ఆడుకుంటుండగా బాలికను తల్లి పిలిచింది. శనివారం ఒంటి గంట సమయంలో బాలికతో పాటు ఆమె సోదరుడిని ఇంట్లో బంధించి బయట నుంచి లాక్ చేసింది. రూమ్‌లో తన కూతురు ఆత్మహత్య చేసుకుందనే అనుమానంతో స్థానికులను అలర్ట్ చేసింది. వెంటనే స్థానకులు డోర్‌ను బలవంతంగా ఓపెన్ చేసి ఉరేసుకున్న బాలికను ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందిందని పరీక్షించిన వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.