
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ పై భారత్ గెలిచి సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. వెస్టిండీస్ పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. భారత జట్టు 19.2 ఓటర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ భారీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. విండీస్‌పై భారత జట్టు గెలవడంలో సంజూ శామ్సన్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు ఆడి టీమిండియా గెలిపించి మ్యాచ్‌ను సంజూ శాసించాడు. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ స్పందించారు. టీమిండియా బౌలర్లు ప్లాన్ ప్రకారమే బౌలింగ్ చేశారని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. సంజూ శామ్సన్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడని కొనియాడారు. భాగస్వామ్యలే కీలకంగా మారుతాయని, ఒత్తిడిలో క్రికెట్ ఆడటంతోనే బ్యాటర్ల గొప్పతనం బయటపడుతుందన్నారు. ఒత్తిడి లేకుండా ఆనందం లేదని స్పష్టం చేశారు. తాము ఆడిన విధానంతో మాకు చాలా సంతోషంగా ఉందని, చావోరేవో తేల్చుకోవాల్సిన క్వార్టర్ ఫైనల్ లాంటి మ్యాచ్ టీమిండియా అద్భుతం చేశారని మెచ్చుకున్నారు. ఓపికగా ఎదురు చూసిన మనుషులకు మంచే జరుగుతుందని సంజు శామ్సన్ ఉదేశించి అన్నాడు. సంజు ఆడిన విధానంతో తాము గెలుపు సాధించామని సూర్య తెలిపారు.