
Lemon Pickle: పచ్చళ్లు అంటే ఎవరికి ఇష్టం ఇండదు.. అందరికి ఇష్టమే. ఈ సీజన్‌లో పచ్చళ్ల భారీగా పెడుతుంటారు. అవకాయ పచ్చడి, టమమాట పచ్చడి, నిమ్మ కాయ పచ్చడి ఇలా రకరకాల పచ్చళ్లు పెడుతుంటారు. అయితే నిమ్మకాయ పచ్చడిని చాలా మంది ఇష్టపడుతుంటారు. కానీ నిల్వ పచ్చడి పెట్టాలంటే పచ్చడి విధానం తెలిసి ఉండాలి. లేదంటే త్వరగా పాడైపోతుంటుంది. పాత కాలం నాటి ఇంట్లో పెట్టే అమ్మమ్మ పచ్చడి చాలా ఫేమస్.
అప్పట్లో తయారు చేసి విధానం రుచిగా ఉండడమే కాకుండా ఏడాది పాటు నిల్వ ఉంటుంది. అయితే నిమ్మకాయ నిల్వ పచ్చడి (Lemon Pickle) తయారీ విధానం చాలా సులభం. ఎండబెట్టే పని లేకుండా, ఎక్కువ కాలం నిల్వ ఉండేలా సాంప్రదాయ పద్ధతిలో ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ఇది కూడా చదవండి: Lemons: నిమ్మకాయలు నెల రోజుల పాటు తాజాగా ఉండాలా? ఈ చిట్కాలు పాటించండి!
కావలసిన పదార్థాలు:
➦ నిమ్మకాయలు: 15 నుండి 20 (మచ్చలు లేనివి)
➦ ఉప్పు: ముప్పావు కప్పు (రుచికి తగినంత)
➦ కారం: 1 కప్పు
➦ మెంతి పొడి: 2 టీస్పూన్లు (దోరగా వేయించిన మెంతుల పొడి)
➦ ఆవ పిండి: 2 టీస్పూన్లు
➦ పసుపు: 1 టీస్పూన్
➦ నూనె: 1 కప్పు (వేరుశెనగ నూనె లేదా నువ్వుల నూనె బాగుంటుంది)
➦ పోపు కోసం: ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ, వెల్లుల్లి రెబ్బలు.
తయారీ విధానం:
1. నిమ్మకాయలను సిద్ధం చేయడం:
ముందుగా నిమ్మకాయలను శుభ్రంగా కడిగి, తడి లేకుండా పూర్తిగా తుడవాలి. ఒక్క చుక్క తడి ఉన్నా పచ్చడి పాడైపోయే అవకాశం ఉంది. ఒక్కో కాయను 8 ముక్కలుగా కోసి గింజలను వేరు చేయాలి.
2. ఉప్పులో ఉంచడం:
ఒక గాజు సీసా లేదా ప్లాస్టిక్ డబ్బాలో నిమ్మకాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. దీనిని మూత పెట్టి కనీసం 3 నుండి 4 రోజుల పాటు పక్కన ఉంచాలి. రోజుకు ఒకసారి పొడి గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ముక్క మెత్తబడి రసం ఊరుతుంది.
3. మసాలాలు కలపడం:
ముక్కలు మెత్తబడిన తర్వాత, అందులో కారం, ఆవ పిండి, మెంతి పొడి వేసి బాగా కలపాలి.
4. పోపు పెట్టడం:
బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, చిటికెడు ఇంగువ వేయాలి. పోపు పూర్తిగా చల్లారిన తర్వాతే పచ్చడిలో కలపాలి. వేడి నూనె పోస్తే పచ్చడి నల్లగా మారుతుంది.
ముఖ్యమైన చిట్కాలు:
➦ నిల్వ: ఈ పచ్చడిని గాజు సీసాలో భద్రపరిస్తే ఏడాది పాటు తాజాగా ఉంటుంది.
➦ ముక్క మెత్తబడాలంటే: తొక్క పల్చగా ఉన్న కాయలను ఎంచుకుంటే ముక్క త్వరగా ఊరుతుంది.
➦ తీపి పచ్చడి: మీకు తీపి నిమ్మకాయ పచ్చడి కావాలంటే పైన చెప్పిన మిశ్రమంలో కారానికి బదులుగా సమాన మోతాదులో బెల్లం తురుము కలుపుకోవచ్చు.
ఇది కూడా చదవండి: LIC Scheme: రోజుకు కేవలం రూ.45 పొదుపుతో రూ.25 లక్షల రిటర్న్స్.. జీవితాంతం ఉచిత బీమా!
ఇది కూడా చదవండి: Gold Price Today: మళ్లీ పుంజుకుంటున్న బంగారం ధర.. వెండి మాత్రం తగ్గింది!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి