
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల తన అప్ కమింగ్ మూవీ పెద్ది షూటింగ్ సమయంలో స్వల్పంగా గాయపడ్డారు. హైదరాబాద్ లో ఒక ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆయన కనుబొమ్మ పైభాగాన స్వల్ప గాయం అయినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ అభిమానులు ఈ వార్తతో ఆందోళనకు గురయ్యారు. అయితే చిత్ర యూనిట్ తక్షణమే స్పందిస్తూ, ఇది కేవలం చిన్న గాయమేనని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. వైద్యుల సూచన మేరకు రామ్ చరణ్ రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఈ కారణంగా షూటింగ్ కు స్వల్ప బ్రేక్ వచ్చింది. రెండు రోజుల తర్వాత చరణ్ మళ్ళీ సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.
మరిన్ని వీడియోల కోసం :