
ఇటీవల అమెరికాఇజ్రాయెల్ సంయుక్తంగా జరిపిన వైమానిక దాడుల్లో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ భార్య మన్సూరెహ్ ఖొజెత్సెటెహ్ భఘెర్జాదెహ్ మరణించారు. ఈ మేరకు సోమవారంనాడు ఇరాన్ అధికారిక మీడియా వెల్లడించింది. ఇదే దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన అల్లుడు, కుమార్తె, మనవరాలు మృతి చెందారు. ఖమేనీ భార్య మరణం పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్తతలకు తావిచ్చే అవకాశం ఉందని ఇరాన్ వర్గాలు తెలిపాయి.