Reading Time: < 1 minute
Israeli Airstrikes Kill Iranian Intelligence Officials Operation Roaring Lion Update

Israel-Iran war: ఇరాన్‌లో కీలక వ్యక్తులు లక్ష్యంగా ఇజ్రాయెల్-అమెరికా వైమానిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ.. ఇజ్రాయెల్‌ వైమానిక దాడుల్లో మరో ఇరాన్ మంత్రి సహా పలువురు నిఘా అధికారులు మృతి చెందినట్లు సమాచారం. Israel Defense Forces (IDF) విడుదల చేసిన ప్రకటన ప్రకారం, “ఆపరేషన్ రోరింగ్ లయన్”లో భాగంగా ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రిత్వ శాఖకు చెందిన ఇద్దరు సీనియర్ అధికారులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపినట్లు పేర్కొంది. ఖచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్లు ఐడీఎఫ్ తెలిపింది. టెహ్రాన్‌లోని మంత్రిత్వ శాఖ ప్రధాన కార్యాలయంపై కూడా దాడి చేసినట్లు వెల్లడించింది.

Read Also: CM Chandrababu: సీఎం తీవ్ర అసంతృప్తి.. పబ్లిక్ పర్సెప్షన్ 80 – 90 శాతం ఉండాల్సిందే..!

ఈ దాడిలో ఇరాన్ డిప్యూటీ ఇంటెలిజెన్స్ మంత్రి సయ్యద్ యాహ్యా హమీది మృతి చెందినట్లు ఐడీఎఫ్ ప్రకటించింది. అదనంగా, గూఢచర్య విభాగం అధిపతి జలాల్ పుర్ హుస్సేన్ కూడా మరణించినట్లు పేర్కొంది. చనిపోయిన వారిలో Islamic Revolutionary Guard Corps (IRGC) కు చెందిన పలువురు అధికారులు ఉన్నారని తెలిపింది. ఇజ్రాయెల్ వైమానిక దళం టెహ్రాన్‌లోని కీలక స్థావరాలపై దాడులు నిర్వహించినట్లు సమాచారం. ప్రాంతీయ భద్రత మరియు తమ పౌరుల రక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. అయితే, ఈ ఘటనపై Iran నుండి తక్షణ అధికారిక ప్రతిస్పందన వెలువడలేదు. ప్రస్తుతం ఈ వాదనలకు స్వతంత్ర నిర్ధారణ లేదు. ఇజ్రాయెల్–ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. మధ్యప్రాచ్య ప్రాంతంలో ఇప్పటికే ఉన్న అస్థిర పరిస్థితులు మరింత విషమించే అవకాశాలు కనిపిస్తున్నాయి