Reading Time: < 1 minute

అమరావతి: ప్రియుడు, భర్త కలిసి భార్యను చంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా రాజుపాలెం మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. ఉప్పలపాడు గ్రామంలో ఈశ్వరయ్య-మల్లేశ్వరి అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులు ఇద్దరు కుమారులు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన వేల్పులు నాగేశ్వరరావుతో మల్లేశ్వరి అక్రమ సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసినా కూడా పట్టించుకోలేదు. మల్లేశ్వరి కుటుంబాన్ని నాగేశ్వర్ రావు కూడా ఆర్థికంగా ఆదుకోవడంతో ఈశ్వరయ్య పట్టించుకోవడంలేదు. మల్లేశ్వరి మరో వ్యక్తితో చనువుగా ఉండడంతో నాగేశర రావు ఆగ్రహంగా ఉన్నాడు. ఈ నెల 25వ తేదీన మల్లేశ్వరి ఇంటికి ఆలస్యంగా రావడంతో ప్రియుడు, భర్త ఆమెతో గొడవకు దిగారు. ఘర్షణ తారాస్థాయికి చేరుకోవడంతో ఆమె రెకుల షెడ్డులోకి తీసుకెళ్లి ఊపిరాడకుండా చేసి హత్య చేశారు. అనంతరం ఇద్దరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. రేకుల షెడులో మల్లేశ్వరి కనిపించడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కూతురు ఫ ఫిర్యాదు మేరకు ఈశ్వరయ్య అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా నిజాలు ఒప్పుకున్నాడు. వెంటనే భర్త, ప్రియుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.