Reading Time: < 1 minute

బెంగళూరు: ఎనిమిదో తరగతి బాలికపై స్కూల్ యజమాని అత్యాచారం చేసిన సంఘటన కర్నాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. ఈ సంఘటనలో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దెహన్‌హళ్లి ప్రాంతంలో 600 మంది విద్యార్థులతో నర్సరీ నుంచి పదో తరగతి వరకు స్కూల్‌ను ఓ వ్యక్తి నిర్వహిస్తున్నారు. ఈ స్కూల్లో 150 మంది బాలికలు చదువుకుంటున్నారు. ఎనిమిదో తరగతి విద్యార్థినిని గత ఎనిమిది రోజుల నుంచి స్కూల్ యజమాని లైంగికంగా వేధించడంతో పాటు అత్యాచారం చేస్తున్నారు. భార్య, స్కూల్ ప్రిన్సిపాల్ సహాయంతో బాలికపై యజమాని లైంగిక దాడికి పాల్పడడంతో హింసకు గురి చేస్తున్నాడు. బాలిక ఈ విషయం తన తల్లిదండ్రులకు చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్‌లో వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్కూళ్లోని విద్యార్థుల నుంచి ఫిర్యాదులు కూడా స్వీకరిస్తున్నారు. యజమాని, టీచర్లు విద్యార్థినిలతో అసభ్యంగా ప్రవర్తించారా? అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.