
హైదరాబాద్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ నాయకులు రాహుల్‌కు ఘన స్వాగతం పలికారు. రాహుల్ గాంధీ నాయకత్వం వర్థిల్లాలి అంటూ కాంగ్రెస్ శ్రేణులు నినాదాలు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఒకే కారులో రేవంత్, రాహుల్ వికారాబాద్‌కు బయలుదేరారు.
పది రోజుల పాటు వికారాబాద్‌లో జరుగుతున్న తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల డిసిసి అధ్యక్షుల శిక్షణా తరగతులు జరుగుతున్న సంగతి తెలిసిందే. చివరి రోజు సోమవారం రాహుల్ హాజరై డిసిసి అధ్యక్షులకు దిశా నిర్ధేశం చేయనున్నారు. రాహుల్ గాంధీ పర్యటనలో కేవలం శిక్షణ తరగతులకే పరిమితం కాకుండా, రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ప్రాధాన్యత కలిగిన కొన్ని అంశాలపై కూడా దృష్టి సారించనున్నారు. తెలంగాణ నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై రాహుల్ గాంధీ ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సామాజిక సమీకరణాలు, పార్టీ విధేయత ప్రాతిపదికన పేర్లను ఖరారు చేసే అవకాశం ఉంది. మాజీ మావోయిస్ట్ నేతలతో భేటీ ? ఇదిలాఉండగా రాహుల్ పర్యటనలో మరో ఆసక్తికర అంశం మావోయిస్ట్ మాజీ అగ్రనేతలను కలవనున్నారని తెలిసింది. ఇది ఇంకా ఖరారు కాలేదు. కానీ సమయాన్ని బట్టి కొంతసేపు సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలు, క్షేత్ర స్థాయి పరిస్థితులపై వారితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.
మాజీ మావోయిస్ట్ నేతలతో భేటీ ?
ఇదిలాఉండగా రాహుల్ పర్యటనలో మరో ఆసక్తికర అంశం మావోయిస్ట్ మాజీ అగ్రనేతలను కలవనున్నారని తెలిసింది. ఇది ఇంకా ఖరారు కాలేదు. కానీ సమయాన్ని బట్టి కొంతసేపు సమావేశమయ్యే అవకాశం ఉందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలు, క్షేత్ర స్థాయి పరిస్థితులపై వారితో చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది.