Reading Time: < 1 minute
Abhishek Sharma Under Fire After Poor Show In T20 World Cup 2026 Super 8 Match Vs West Indies

Abhishek Sharma: టీ20 వరల్డ్ కప్ 2026లో టీమిండియా స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనపై క్రికెట్ విశ్లేషకులు మాత్రమే కాకుండా సగటు క్రికెట్ అభిమాని కూడా మండిపడుతున్నారు. తాజాగా వెస్టిండీస్‌ తో జరిగిన సూపర్-8 కీలక పోరులో అతని ఆట ఎలా ఉందో ఇట్టే అర్థమవుతుంది. కోల్‌కతాలో మ్యాచ్‌లో అభిషేక్ బ్యాటింగ్‌తోనే కాకుండా ఫీల్డింగ్‌లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. సెమీఫైనల్ అవకాశాల దృష్ట్యా ఈ మ్యాచ్ భారత్‌కు అత్యంత కీలకం కావడంతో.. ఇప్పుడు అభిషేక్ చేసిన తప్పిదాలు అభిమానుల ఆగ్రహానికి కారణమయ్యాయి.

Team India History: ఐసీసీ టోర్నీల్లో భారత్ నయా చరిత్ర.. ఆస్ట్రేలియాకి కూడా సాధ్యం కాలేదు!

వెస్టిండీస్ భారత్ ముందు 196 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఆ లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనర్‌గా దిగిన అభిషేక్ శర్మ కేవలం 10 పరుగులకే పరిమితమయ్యాడు. సాధారణంగా వేగంగా పరుగులు సాధించే అభిషేక్, ఈసారి 11 బంతులు ఎదుర్కొని 10 పరుగులు మాత్రమే చేయడం గమనార్హం. స్ట్రైక్‌రేట్ 100 కంటే తక్కువగా ఉండటం జట్టుపై ఒత్తిడిని పెంచింది. కీలక సమయంలో ఇలాంటి నెమ్మదైన ఇన్నింగ్స్ జట్టు రన్‌రేట్‌పై ప్రభావం చూపింది.

బ్యాటింగ్‌లో పరిస్థితి ఇలా ఉండగా.. అభిషేక్ బ్యాటింగ్ కంటే ముందు ఫీల్డింగ్‌ లోనూ ఘోరంగా నిరాశపరిచాడు. విండిస్ 5వ ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో రోస్టన్ చేజ్ ఇచ్చిన సులభమైన క్యాచ్‌ ను నేలపాలు చేశాడు. అదే విధంగా 19వ ఓవర్‌లో అర్షదీప్ సింగ్ బంతిపై రోవ్‌మన్ పావెల్ ఇచ్చిన మరో క్యాచ్‌ను కూడా పట్టుకోలేకపోయాడు. ఈ రెండు క్యాచ్‌ లు వదిలేయడంతో టీమిండియా సుమారు 40 పరుగులను సమర్పించుకున్నట్లైంది. ఈ గోల్డెన్ అవకాశాలతో వెస్టిండీస్ 195 పరుగుల స్కోర్‌ ను అందుకుంది.

Sanju Samson: సంజూ సెలబ్రేషన్ వివాదం.. భావోద్వేగంలో బిగ్ మిస్టెక్.. ఐసీసీ చర్యలు తప్పవా?

మైదానంలో జరిగిన ఈ తప్పిదాలతో అభిషేక్ శర్మపై క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే అతనిపై భారీగా ట్రోలింగ్ సాగుతోంది. ఇందులో ముందు ఆయన్ని పక్కన పెట్టండి మహాప్రభో.. అంటూ పెద్దేత్తున్న కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే వీలైనంత త్వరగా కంబ్యాక్ గట్టిగా ఇవ్వమని అతడిని సపోర్ట్ చేస్తున్నారు కూడా..