
హైదరాబాద్: టి20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ 8లో భాగంగా భారత్- వెస్టిండీస్ మధ్య జరిగిన మ్యాచ్ లో విండీస్ పై భారత్ గెలిచి సెమీ ఫైనల్ కు దూసుకెళ్లింది. వెస్టిండీస్ పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. భారత జట్టు 19.2 ఓటర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. సంజూ శామ్సన్ భారీ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. విండీస్‌పై భారత జట్టు గెలవడంలో సంజూ శామ్సన్ కీలక పాత్ర పోషించాడు. ఓపెనర్‌గా వచ్చి చివరి వరకు ఆడి టీమిండియా గెలిపించి మ్యాచ్‌ను సంజూ శాసించాడు. ఈ సందర్భంగా సంజూ శామ్సన్ మీడియాతో మాట్లాడారు. టి20ల్లో తాను చేసిన మూడు సెంచరీల కంటే ఇది ముఖ్యమైన ఇన్నింగ్స్ అని తెలిపాడు. దేశం కోసం గత పదేళ్లు నుంచి ఆడుతున్నానని, కానీ ఇప్పటివరకు 50 లేదా 60 మ్యాచ్‌లు ఆడే అవకాశం వచ్చిందన్నారు. క్రికెట్ ఆడేటప్పుడు దేశం కోసం ఆడాలని కలలు కన్నానని, ఇలాంటి రోజు కోసం ఎప్పటి నుంచో వేచి చూసున్నానని చెప్పారు.
ఈ అవకాశం ఇచ్చిన మేనేజ్‌మెంట్ సంజూ ధన్యవాదాలు తెలిపారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి అత్యత్తమ బ్యాట్స్‌మెన్ల బ్యాటింగ్ చూశానని, వాళ్ల ఎలా ఫినిష్ చేశారో ఇప్పుడు తాను అదే పని చేశానని సంజూ చెప్పారు. పరిస్థితులకు తగినట్టుగా గేమ్‌ను మార్చుకుంటూ ముందుకు సాగానని, గత మ్యాచ్‌లో భారీగా పరుగులు చేయాలనే లక్షంతో బ్యాటింగ్ చేయాల్సి రావడంతో త్వరగా ఔటయ్యానని వివరణ ఇచ్చాడు. వికెట్లు పడుతున్నప్పుడు భాగస్వామ్యం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నానని, ప్రత్యేకంగా ఫ్లాన్ ఏమీ చేయలేదని స్పష్టం చేశారు. కెరీర్‌లో ఎన్నో ఇబ్బందులు పడ్డానని, ఎత్తు పల్లాలు చూశానని, ఒక్కోసారి తనపై తనకే అనుమానం కలిగేదని, తాను సాధించగలనా అనే అనుమానాలు వచ్చేవన్నారు. తీవ్రంగా ఆలోచన చేసి అన్నీ దేవుడి మీద బారం వేసి బ్యాటింగ్ చేశానని, ఇప్పుడు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడగలిగానని సంజూ పేర్కొన్నారు. తన జీవితంలో అద్భుతమైన రోజులలో ఇది ఒకటి అని, తోటి ఆటగాళ్ల నుంచి తనకు చాలా మద్దతు వచ్చిందన్నారు.