
టెహ్రాన్: ఎర్రజెండా.. నిరసనలకు, ప్రతీకారానికి, ధిక్కారానికి ప్రతీక. ఇరాన్‌లో మతపరమైన ప్రాముఖ్యతగల ప్రదేశం అయిన జమ్కరన్ మసీదు గో పురంపై ఎర్రజెండా ఎగురవేయడం సంచలనంగా మారింది. ఇరాన్ సు ప్రీం నాయకుడు మరణించిన తర్వాత, న్యాయానికి, ప్రతీకారానికి ప్రతీక గా ఎర్రజెండా ఎగురవేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ కోమ్ నగరంలోని మసీదుపై ఎర్రజెండా ఎగురవేయడం నాయకుడి పై ఇరాన్ వాసులలో పెరిగిన కోపం, ప్రతీకారాన్ని ప్రతిబింబిస్తున్నది. ఇదే సమయంలో ఖమేని మద్దతు దారులకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ఇరాన్ పై శనివారం ఇజ్రాయెల్ -అమెరికా సంయుక్తంగా జరిపిన వైమానికదాడిలో ఖమేనీ మరణించారు. ఆదివారం ఇరాన్ అధికారికంగా ఈ విషయాన్ని ధ్రు వీకరించింది. దీంతో, పాకిస్తాన్, భారతదేశంతో పాటు ప్రపంచంలోని పలు దేశాలలో నిరసనలు జరిగాయి. సంతాపాన్ని రేకెత్తించాయి. ప్రపంచ చరిత్రలో అత్యంత దుర్మార్గులలో ఒకరైన ఖమేనీ చనిపోయాడని అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇరాన్ ప్రజలు తమ దేశం దశ,దిశ మార్చుకోడానికి ఇది ఏకైక గొప్ప అవకాశంఅన్నారాయన. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పందిస్తూ, ఖమేని అనే నిరంకుశుడు ఇక లేడని స్పష్టమైందన్నారు.