Reading Time: 2 minutes

 ఈనెల తేదీలోగా ఖమ్మంలో అర్హులైన

పేదలందకీ ఇళ్ల ఇందిరమ్మ ఇళ్లు

మంజూరు సకల హంగులతో

సదుపాయాలు పేదలను అడ్డంపెట్టుకొని

ప్రతిపక్షాల చిల్లర రాజకీయం మంత్రి

పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటన వెలుగుమట్ల

బాధిత కుటుంబాలతో భేటీ, భరోసా

మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: వెలుగుమట్ల భూదాన్ భూములలో ఉన్న ఆక్రమణల తొలగింపులో నిరాశ్రయులైన అర్హులైన పేదలందరికీ ఈనెల 15లోగా ఇంళ్ల స్థలాలతోపా టు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి రూ.5 లక్షల సాయాన్ని అందిస్తామని రెవెన్యూ శాఖమంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఆదివారం సాయంత్రం ఖమ్మం కలెక్టరెట్‌లో వెలుగుమట్ల బాధితులతో సమావేశమైవారి సాదకబాదకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఖ మ్మం నగరంలో నివాసయోగ్యమైన భూముల్లోని వారికి గృహ సముదాయాలను నిర్మించి మౌలి క సదుపాయాలను కూడా కల్పిస్తామన్నారు.అంగన్ వాడీ సెంటర్, స్కూల్, విద్యుత్, మం చినీటి వసతి సౌకర్యాలను కూడా కల్పిస్తామన్నారు. వెలుగుమట్లలోని 31 ఎకరాల భూదాన్ భూముల స్థలంలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు గత తొమ్మిదేళ్ళ నుంచి అక్కడ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని నిరుపేదల నుంచి రూ.30 వేల నుంచి రూ.9 లక్షల వరకు వసూళ్ళు చేశారని అక్రమంగా వసూళ్ళు చేసిన సొమ్మును సైతం రికవరీ చేయించి బాధితులకు అందజేస్తామన్నారు.

వెలుగుమట్ల భూముల్లో నిరాశ్రయిలైన వారిపై సర్వే చేయించగా అనేక నిజాలు వెలుగులోకి వచ్చాయని, బాధితుల్లో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు,గతంలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్ళ లబ్ద్ధిదారులు ఉన్నట్లు తేలిందన్నారు. మొత్తం 720 కుటుంబాల్లో సగం మంది ఖమ్మం జిల్లా వారు కాగా మిగిలిన వారంతా ఈ జిల్లాకు సమీపంలోని జిల్లాలకు, నియోజకవర్గాలకు చెందినవారుగా గుర్తించామన్నారు. వెలుగుమట్ల ప్రభుత్వ భూదాన్ భూముల ఆక్రమణలో తప్పు ఒకరు చేస్తే, శిక్ష మరొకరికి వచ్చినట్లు కొంతమంది బాధితులు తెలియక అక్కడ ఇండ్ల పట్టాలు పొందామనే భ్రమలో ఇండ్లు కట్టుకున్నారని మంత్రి అన్నారు.అక్కడ ఏ నిరుపేద ఉచితంగా స్థలాన్ని పొందలేదని వెలుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని , తాము ఈ అంశాన్ని కేవలం పేదల కోణంలోనే చూస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం కేవలం పేదలకు ఉద్దేశించని ప్రభుత్వం అని, పేదలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరిగే ప్రసక్తే ఉండదన్నారు. వెలుగుమట్ల సంఘటనలో బాధితులు ఎప్పటినుంచి ఇక్కడ ఉంటున్నారు, ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నాయో అధికారులతో క్షుణ్ణంగా విచారణ చేయించి నిరుపేదలకు తప్పనిసరిగా న్యాయం చేస్తామని అన్నారు. బాధితులు వెలుగుమట్ల ఇంటి స్థలం కోసం ఎవరికి డబ్బులు ఇచ్చారో నిర్భయంగా పోలీసు అధికారులకు చెప్పాలని, ఆ డబ్బులు కూడా బాధితులకు వచ్చేలా ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.

ఒక కమిటి గా ఏర్పడి అక్కడ ప్రత్యేక వ్యవస్ద నడిపించారని ఎవ్వరైనా పని ఉండి ఇతర ఊర్లోకి వెళ్ళి వచ్చే సరికి ఇల్లు చేతులు మారుతుందని, తాళం పట్టిందే తడువుగా కొత్తవారికి విక్రయించారని,ఇదేమని ప్రశ్నిస్తే దాడులకు ,దౌర్జన్యాలకు దిగారని మంత్రి తెలిపారు.గడిచిన పదేళ్ళు అక్కడ భయంతో బిక్కు బిక్కుమంటూ కాలం గడిపారన్నారు.పట్టా ఇవ్వకపోగా,తీసుకున్న డబ్బులకు కూడా రశీదులు పత్రాలు ఇవ్వలేదన్నారు. పేద ప్రజల పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని, గత పాలకులు వెలుగుమట్ల బాధితులకు పట్టాలు పంపిణీ చేయని కారణంగానే నేడు కూల్చివేతలు జరిగాయని మంత్రి అన్నారు. ఈరోజు వచ్చి మొసలి కన్నీరు కార్చే నాయకులు పదేళ్ళు అధికారంలో ఉండి వారికి ఎందుకు ఇళ్ళ ను నిర్మించి ఇవ్వలేదని,కనీసం విద్యుత్,మంచినీటి సౌకర్యాన్ని కూడా ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు.2023లో ఆగస్ట్ నెలలో అనాటి బి ఆర్ ఎస్ ప్రభుత్వ హాయంలో కూడా కొన్ని ఇళ్లను కూడా కూలగొట్టారని ఆయన అన్నారు.

శవాల మీద చిల్లరు ఎరుకునేవిధంగా రాజకీయాలు చేయవద్దని నిబద్దతతో నిజాలు మాట్లాడలన్నారు పదేళ్ళు అక్కడ విద్యుత్ సౌకర్యం,మంచినీరు లేక ఉంటే అనాటి ప్రభుత్వానికి కళ్ళు లేకుండా పోయిందా?అని ప్రశ్నించారు.పేదలను ముందు పెట్టి రాజకీయం చేయడం సిగ్గు చేటని ,ముఖ్యమంత్రి,మంత్రుల మీద అభండాలు వేసేముందు అలోచించాలన్నారు.కన్నీరు డ్రామాలను రాష్ట్ర ప్రజలు ఆర్దం చేసుకుంటున్నారని ఆయన అన్నారు.దమ్ముంటే ముందుకు రండి గీతగిస్తాను రండి ఒక్కొక్కరి చరిత్ర ఏంటో తెలుస్తానన్నారు. తన మాటలను వక్రికరించి చూపించారని,కొన్ని మీడియా సంస్ధలు అవాస్తవాలను ప్రచురించడం తగదన్నారు.డిప్యూటి సి ఎం మల్లు భట్టి,మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు తమ వ్యక్తిగత పనుల్లో బిజిగా ఉండటం వల్ల ఇక్కడికి రాలేకపోయారన్నారు.రాజకీయంగా కొట్లాడాలే గాని పేదలను అడ్డుపెట్టుకోని రాజకీయంగా లబ్ది పొందాలని అనుకోవడం ముర్ఖత్వం అవుతుందన్నారు.విమర్శలు చేయవచ్చు కాని విమర్శలకు కూడా ఆర్ధం ఉండాలన్నారు.డ్రామా యాక్టింగ్ బాగా చేస్తున్న మాజీ మంత్రులకు వెలుగుమట్ల పేదలు ఈ రోజు గుర్తుకువచ్చారా ? అని ఆయన ప్రశ్నించారు.ఈసందర్బంగా వెలుగుమట్ల బాధితులు దళారులకు ఎలా డబ్బులు ఇచ్చి మోసపోయామో మీడియా ప్రతినిధుల ఎదుట వివరించారు.నిరుపేదలను మోసం చేసిన వారిపై చట్టరిత్య చర్య తీసుకుంటామని ఈ సందర్బంగా మంత్రి తెలిపారు.