Reading Time: < 1 minute

చర్చలకు

ఇరాన్ సంసిద్ధత

సరేనన్న ట్రంప్ ఒకే దాడిలో 48మంది ఇరాన్ నేతలను హతమార్చినట్లు వెల్లడి

న్యూఢిల్లీ: ఇరాన్ పై జరుగుతున్న అమెరికా- ఇజ్రాయెల్ సం యుక్త దాడిలో ఒకే దాడిలో 48 మంది నాయకులు హతమయ్యారని ట్రంప్ ఆదివారం ప్రకటించారు. ఈ దాడి మెరుపు వేగంగా, అత్యంత విజయవంతంగా జరుగుతోందని ఆయన అభివర్ణించారు. ఈ సక్సెస్‌ను ఎవరూ ఊహించి కూడా ఉండరని ఆయన అన్నారు. ఇరాన్‌లో అమెరికా దాడి షెడ్యూల్డ్ క న్నా ముందే మొదలైందని, దూసుకుపోతోందని ట్రంప్ అన్నా రు. ఇరాన్ కొత్త నాయకత్వం వాషింగ్టన్‌తో చర్చలు జరపడానికి ముందుకు వచ్చిందని, సంభాషణలో పాల్గొనేందుకు తా ను అంగీకరించానని ప్రెసిడెంట్ తెలిపారు. కొత్త నాయకత్వం నాయకులు మాట్లాడాలని అనుకుంటున్నారు. నేను మాట్లాడడానికి అంగీకరించాను అని ట్రంప్ ది అట్లాంటిక్ కు ఇచ్చిన ఇంటర్ వ్యూలో తెలిపారు.