Reading Time: < 1 minute

గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్ రివర్స్.. ఒక్కసారిగా పెరిగిన ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో మారిన రేట్లివే..

Caption of Image.

ఈ వారం స్టార్టింగ్ నుంచి తగ్గిన బంగారం వెండి ధరలు వీకెండ్ వచ్చేసరిగా యూటర్న్ తీసుకున్నాయి. అంతర్జాతీయంగా మారుతున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల దృష్ట్యా రేట్లు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం రోజున షాపింగ్ చేయాలనుకుంటున్న వారు ముందుగా తమ నగరాల్లో మారిన ధరలను పరిశీలించటం అవసరం. 

మే29న బంగారం రేట్లు పెరిగాయి. మే 28 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.158 పెరిగింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 764గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 450గా కొనసాగుతోంది. 

శుక్రవారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. మే 29, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.2లక్షల 90వేలకు పెరిగింది. అంటే గ్రాము దాదాపుగా రూ.290 దగ్గర ఉంది. 

©️ VIL Media Pvt Ltd.