
టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్ విజయ్–రష్మిక వరుస కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. ఆదివారం (మార్చి 1) హైదరాబాద్‌లోని టీటీడీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ నూతన దంపతులు, స్వీట్లు మరియు అన్నదానం నిర్వహించారు.
ఈ క్రమంలోనే సోమవారం (మార్చి 2) తమ స్వగ్రామానికి చేరుకుని సందడి చేస్తున్నారు. వివాహం అనంతరం తొలిసారిగా విజయ్ సొంత ఊరైన నాగర్‌కర్నూల్ జిల్లా, బలమూరు మండలంలోని తుమ్మన్‌పేటలో విరోష్ దంపతులు అడుగుపెట్టారు. వారి రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఈ సందర్భంగా గ్రామస్థులు డప్పు చప్పుళ్లు, నినాదాల మధ్య కొత్త దంపతులకు గ్రాండ్ వెల్ కం చెప్పారు. అనంతరం వారిని ఊరేగింపుగా నివాసానికి తీసుకెళ్లారు. ఉదయం 11:15 గంటలకు కొత్త ఇంట్లోకి కాలుపెట్టిన విజయ్–రష్మిక దంపతులు ముందుగా తులసిమాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Mr&mrs Deverakonda at his new residence for Satyanarayana varatham🙏❤️#VijayDeverakonda #RashmikaMandanna
— THE RWDY🗿X (@TheDEVERA_fan) March 2, 2026
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు. ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
The way she looked at him😭❤️🧿
Virosh perfect as Rama & Sita#VijayDeverakonda #RashmikaMandanna pic.twitter.com/vEoXInxNr3— THE RWDY🗿X (@TheDEVERA_fan) March 2, 2026
భోజనాలు ఏర్పాట్లు
ఈ కార్యక్రమానికి 500 నుంచి వెయ్యి మంది వీఐపీలతో పాటు 5 వేల మంది అభిమానులు హాజరయినట్లుగా సమాచారం. వీఐపీలు, అభిమానులకు వేర్వేరుగా భోజన ఏర్పాట్లు చేసినట్లుగా తెలుస్తోంది. అభిమానుల రద్దీ ఎక్కువగా ఉండటంతో స్థానిక పోలీసులు ముందస్తు జాగ్రతలు చేపట్టారు. గ్రామంలో ఎలాంటి ఘటనలు జరగకుండా జనాలను నియంత్రిస్తున్నారు.
అయితే, అభిమానుల రద్దీ అధికంగా ఉండటంతో స్థానిక పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. పోలీసులు విధించిన ఆంక్షల మేరకు పాసులు ఉన్నవారికే వ్రతం జరుగుతున్న మండపంలోకి అనుమతి ఇచ్చారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జన సమూహాన్ని నియంత్రిస్తున్నారు. ఈ వేడుక భద్రతా ఏర్పాట్లను అచ్చంపేట డీఎస్పీ పర్యవేక్షిస్తున్నారు.