Reading Time: < 1 minute

చరిత్ర సృష్టించిన జమ్మూకాశ్మీర్: 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో తొలిసారి విజేత!

Caption of Image.

దేశవాళీ క్రికెట్ అత్యున్నత టోర్నీ రంజీ ట్రోఫీ విజేతగా నిలిచి జమ్మూకాశ్మీర్ సంచలనం సృష్టించింది. సుమారు 90 ఏళ్ల రంజీ ట్రోఫీ చరిత్రలో (మొదటి టోర్నీ 1934లో ప్రారంభమైంది) జమ్మూకాశ్మీర్ జట్టు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి. హుబ్బళిలో కర్ణాటకతో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్‌లో జమ్మూకాశ్మీర్ జట్టు విజయం సాధించింది. 

తొలి ఇన్నింగ్స్​లో లభించిన 291 పరుగుల భారీ ఆధిక్యం ఆధారంగా జమ్మూకాశ్మీర్‌ను విజేతగా ప్రకటించారు. అద్భుత ప్రదర్శన చేసిన జమ్మూకాశ్మీర్ ఆటగాడు శుభమ్ పుందిర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును దక్కించుకున్నాడు. ఈ సీజన్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న ఆకిబ్ నబి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ’గా ఎంపికయ్యాడు. ఈ సీజన్‌లో మొత్తం 60 వికెట్లు తీయడమే కాకుండా, బ్యాటింగ్‌లో 245 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

©️ VIL Media Pvt Ltd.