
ఇరాన్ సంక్షోభం నేపథ్యంలో గల్ఫ్‌లోని తెలంగాణ వాసుల్లో ఆందోళన యోగక్షేమాలు తెలుసుకుంటున్న కుటుంబ సభ్యులు
బహ్రెయిన్‌లోని బంకర్‌లో తలదాచుకున్న ఆర్మూర్ వాసులు దుబాయ్‌లో తృటిలో తప్పించుకున్న ప్రముఖ టెన్నిస్
టేఙుకీడాకారిణి పివి.సింధు అక్కడే నటుడు విష్ణు కుటుంబం శంషాబాద్ నుంచి44 విమాన సర్వీసులు రద్దు
మన తెలంగాణ/హైదరాబాద్ : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తలతో గల్ఫ్ దేశాలకు బతుకుదెరువు కోసం వెళ్లిన తెలంగాణ వా సులు బిక్కుబిక్కుమంటున్నారు. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల సంయుక్త సైనిక ఆపరేషన్‌లో ఇ రాన్ సుప్రీం ఖమేనీ మృతి చెందడంతో, అందుకు ప్రతిగా గల్ఫ్ దే శాలపై ఇరాన్ కొనసాగిస్తోన్న ప్ర తికార దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది. గల్ఫ్ దేశాల్లో ని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ మిస్సైల్, డ్రోన్లు ప్రయోగిస్తోంది. ఈ క్ర మంలో రాష్ట్రంలో నుంచి గల్ఫ్ దేశాలకు వలస వె ళ్లి న వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ప్రధానంగా ఉత్తర తెలంగాణకు చెందిన లక్షలాది మం ది గల్ఫ్ దేశాల్లో జీవనం కొనసాగిస్తున్నారు. భవన నిర్మాణ కార్మికులుగా, తోట పనులు, ఇంటి పను లు, డ్రైవర్లుగా ఇలా వివిధ రంగాల్లో పనులు చేస్తూ ఉపాధి పొందుతున్నారు. పశ్చిమాసియాలో దేశాల్లో కొనసాగుతోన్న యుద్ధంతో అక్కడ ఉపాధి పొందుతున్న వారి ఇక్కడి కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
తమ వారి యోగక్షేమాలను వాట్సప్ కాల్స్ ద్వారా ఎప్పటికప్పుడు అడిగి అక్కడి పరిస్థితిని తెలుసుకుంటున్నారు. దుబాయ్, ఖ తార్, అబుదబీ, కువైట్, ఓమన్, బహ్రెయిన్‌లోని అమెరికా స్థావరాలే లక్షంగా ఇరాన్ దాడులకు దిగడంతో అక్కడ నివాసమున్న వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కు బిక్కు మంటున్నారు. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల నుండి సుమారు 15 లక్షల మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి జీవనోపాధి పొందుతున్నారన్నది అనధికారిక అంచనా.
గల్ఫ్ దేశాలలో ఉన్న తెలుగువారు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఒక ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు గల్ఫ్ దేశాల్లోని ఇండియన్ ఎంబసీ కార్యాలయాలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాయని ఇక్కడి వారు తమకు కుటుంబం సభ్యులకు తెలిపారు. అమెరికా బేస్ క్యాంపులే లక్ష్యంగా ఇరాన్ దాడులకు దిగుతుండటంతో యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, దుబాయ్, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, అబుదాబి, ఇజ్రాయెల్ ఆయా దేశాల్లో ఉన్న భారతీయులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని, స్థానిక అధికారులు ఇచ్చిన సూచనలు కచ్చితంగా పాటించాలని గల్ఫ్ ప్రాంతంలోని పలు భారత ఎంబసీలు ఇప్పటికే అప్రమత్తం చేశాయి. అక్కడున్న వలస కార్మికుల మొబైల్ ఫోన్లకు వాట్సప్ నెంబర్లు పంపించి, అత్యవసర పరిస్థితుల్లో సంప్రదించాలని సూచిస్తున్నారు. దీంతో ఇక్కడున్న వారి కుటుంబసభ్యులు, బంధువులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
బంకర్‌లో తలదాచుకున్న ఆర్మూర్‌వాసులు
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ ప్రాంతానికి చెందిన 8 మంది కార్మికులు బహ్రేన్‌లో ఒక బంకర్‌లో తలదాచుకున్నట్టు ఇక్కడి వారి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం ప్రభుత్వానికి ఇచ్చి తమను కాపాడాలని వారు కోరుతున్నారు.
దుబాయిలో చిక్కుకుపోయిన పీవీ సింధు
ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్‌షిప్‌కు వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు దుబాయిలో చిక్కుకు పోయారు. ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ప్రతిష్టాత్మక ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు పీవీ సింధు బర్మింగ్‌హామ్ వెళ్తున్నారు. దుబాయ్ మీదుగా ప్రయాణించాల్సి ఉండటంతో ఆమె అక్కడ ఆగారు. గగనతలం మూసివేత, భద్రతా కారణాల దృష్ట్యా దుబాయ్ విమానాశ్రయం తన కార్యకలాపాలను నిలిపివేసింది. దీంతో సింధు తన టీమ్ కోచ్ ఇర్వాన్సియా ఆది ప్రతామాతో కలిసి దుబాయ్‌లోనే చిక్కుకుపోయారు.
కళ్లెదుటే భారీ పేలుడు.. భయంకరమైన క్షణాలు..
సింధు సోషల్ మీడియా వేదికగా పంచుకున్న వివరాల ప్రకారం విమానాశ్రయంలో ఉన్న సమయంలో ఆమెకు అత్యంత సమీపంలో ఒక భారీ పేలుడు సంభవించింది. పేలుడు జరిగిన ప్రదేశానికి సింధు కోచ్ చాలా దగ్గరగా ఉన్నారని ఆమె వివరించారు. పొగ, శిధిలాల మధ్య నుంచి ఆయన ప్రాణాలతో బయటపడాల్సి వచ్చిందని తెలిపారు. ఆకాశంలో క్షిపణులను అడ్డుకుంటున్న శబ్దాలు వినపడుతున్నాయని, పరిస్థితి నిమిష నిమిషానికీ భయంకరంగా మారుతోందని సింధు ఆందోళన వ్యక్తం చేశారు. దుబాయ్ అధికారులు, భారత ప్రభుత్వం సకాలంలో స్పందించి సింధు బృందాన్ని సురక్షిత ప్రదేశానికి తరలించినట్టు వివరించారు. ఈ ఆపద సమయంలో తమకు అండగా నిలిచిన దుబాయ్ ఎయిర్‌పోర్ట్ సిబ్బందికి, అలాగే నిరంతరం పర్యవేక్షిస్తున్న దుబాయ్‌లోని భారత హైకమిషన్‌కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మంచు విష్ణు కూడా…
సినీ నటుడు మోహన్‌బాబు కుమారుడు, తెలుగు సినిమా హీరో మంచు విష్ణు కుటుంబం కూడా కొంతకాలంగా పిల్లల చదువుల కోసం దుబయ్‌లోని పామ్ జుమేరాలో ఉంటోంది. ఆయనకు ఇక్కడే సొంతిల్లు కూడా ఉంది. తన పిల్లలతో కలిసి ఆదివారం (మార్చి 1న) పెళ్లి రోజు వేడుకలు జరుపుకోవడానికి ఫిబ్రవరి 27న మంచు విష్ణు దుబాయ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో దుబాయ్‌లో ప్రస్తుతం నెలకొన్న యుద్దానికి సంబంధించిన అనుభవాలను సామాజిక మాద్యమం ద్వారా పంచుకున్నారు. దుబయ్‌లో కుటుంబసభ్యులను కలిసేందుకు వచ్చాను. ఆకాశంలో మిస్త్స్రల్స్ కనిపిస్తున్నాయి. క్షిపణి దాడుల దెబ్బకు ఇళ్ల గోడలు కంపించిపోతున్నాయి. వాటి శబ్ధానికి మా చిన్నపాప భయపడిపోయిందని ఆయన పోస్ట్ చేశారు. ‘శాంతి కోసం ప్రార్థిస్తున్నాం. ఏ బిడ్డ కూడా యుద్ధ శబ్దాలు వింటూ పెరగకూడదు. ఇక్కడి పౌరులను సురక్షితంగా ఉంచినందుకు యూఏఈ రక్షణ దళాలకు కృతజ్ఞతలు. ఇలాంటి క్షణాలు నిజంగా జీవితం ఎంత దుర్బలమైనదో గుర్తుచేస్తాయి” అంటూ మంచు విష్ణు పేర్కొన్నారు.
శంషాబాద్‌ల విమానాశ్రాయంలో
44 విమానాలు రద్దు
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో హైదరాబాద్ శంషాబాద్‌లోని రాజీవ్‌గాందీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి 44 విమాన సర్వీసులు రద్దయ్యాయి. శంషాబాద్ నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లాల్సిన దాదాపు 23 విమాన సర్వీసులు రద్దు కాగా, వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు రావాల్సిన మరో 21 సర్వీసులు నిలిచిపోయాయి. ప్రధానంగా దుబాయ్, దోహా, అబుదాబి, జెడ్డా, మస్కట్, కువైట్, దమ్మమ్ వంటి నగరాలకు ప్రయాణించాల్సిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎయిర్ ఇండియా వంటి ప్రముఖ సంస్థలు ఇప్పటికే మిడిల్ ఈస్ట్ దేశాలకు తమ కార్యకలాపాలను పరిమితం చేయగా, ఇతర అంతర్జాతీయ సంస్థలు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకుని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఏ) ప్రయాణికులకు కీలక సూచనలు జారీ చేసింది. ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు సంబంధిత విమానయాన సంస్థల వెబ్‌సైట్లు లేదా హెల్ప్‌లైన్ నంబర్ల ద్వారా విమాన స్థితిగతులను సరిచూసుకోవాలని సూచించింది. విమానాల రద్దు కారణంగా నష్టపోయిన ప్రయాణికులకు టికెట్ రీఫండ్ లేదా ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లు చేయాలని విమానయాన సంస్థలను ఆదేశించింది. అలాగే, విమాన మార్గాల్లో మార్పుల వల్ల ప్రయాణ సమయం పెరిగే అవకాశం ఉందని కూడా స్పష్టం చేసింది.
ఖమేనీ హత్యను తీవ్రంగా ఖండించిన ఓవైసీ
ఇరాన్ పై జరిగిన దాడిని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపి అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా ఖండించారు. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హత్యను అమానవీయ, చట్టవిరుద్ధమైన, అనైతిక, అంతర్జాతీయ చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించిన చర్యగా ఓవైసీ అభివర్ణించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ జెనీవాలో ఇరాన్, -అమెరికా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే ఈ దాడులు జరగడం దురదృష్టకరమని అన్నారు. పవిత్ర రంజాన్ మాసం అని కూడా చూడకుండా ట్రంప్, నెతన్యాహు దాడులకు తెగబడ్డారని, వారికి అసలు మానవత్వమే లేదని ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్‌పై జరిగిన దాడుల్లో 200 మందికి పైగా చనిపోయారని, వారిలో 108 మంది విద్యార్థినులు ప్రాణాలు కోల్పోవడం తనను కలచివేసిందన్నారు. ఇజ్రాయెల్ తీరును ఓవైసీ పాకిస్థాన్‌తో పోల్చారు. ఈ రెండు దేశాలు ఆక్రమణ దారులని, తమ పొరుగు దేశాలను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదని విమర్శించారు. ఇజ్రాయెల్ ఇరాన్‌పై, పాకిస్థాన్ ఆఫ్ఘనిస్థాన్‌పై చేస్తున్న దాడులే ఇందుకు నిదర్శనమని అన్నారు. నెతన్యాహు పాలనలో పాలస్తీనాలో 70 వేల మంది ఊచకోతకు గురయ్యారని ధ్వజమెత్తారు. ట్రంప్, నెతన్యాహు భావిస్తున్నట్లు ఇరాన్‌లో ప్రభుత్వ మార్పు జరగదని ఆయన స్పష్టం చేశారు. యుద్ధాన్ని ఆపడానికి భారత్ తన వంతు పాత్ర పోషించాలని ఓవైసీ సూచించారు. ‘గల్ఫ్ దేశాల్లో దాదాపు కోటి మంది భారతీయులు పనిచేస్తున్నారని, ఒమన్ పోర్టులో జరిగిన దాడిలో ఇప్పటికే కొందరు భారత కార్మికులు గాయపడినట్లు సమాచారం ఉందన్నారు. ఉమ్రా కోసం వెళ్లిన వారు విమానాలు రద్దై, డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారని ఓవైసీ తెలిపారు. బిజెపి ప్రభుత్వం ఖమేనీ హత్యను ఖండించి, ఈ యుద్ధాన్ని ఆపడానికి కృషి చేయాలని అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు. యుద్ధం ఆగకపోతే ఆ ప్రాంతమంతా అస్థిరత నెలకొంటుందని హెచ్చరించారు. ఉద్రిక్తతలను తగ్గించడంలో, శాంతి ప్రయత్నాలలో భారత ప్రభుత్వం నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు. యుద్ధం కొనసాగితే, అది ప్రపంచ చమురు ధరల పెరుగుదలకు దారితీస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ప్రభావితం చేస్తుందని అసదుద్దీన్ హెచ్చరించారు.