Reading Time: < 1 minute

మీరు నడిపేది ప్రభుత్వమా.. సర్కసా?.. కేంద్ర సర్కారుపై అఖిలేశ్ ఫైర్

Caption of Image.

లక్నో:  కేంద్రంలో బీజేపీ నడిపేది ప్రభుత్వమా? లేక సర్కసా? అని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ప్రశ్నించారు. ప్రభుత్వమే ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ బుక్ లో న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ వివాదాస్పద అంశాలు చేర్చి ఇప్పుడు మళ్లీ తొలగించి, పశ్చాత్తాపం వ్యక్తం చేయటమేమిటని నిలదీశారు. 

ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా స్పందించారు. ” బీజేపీ నేతలు ముందు పెద్ద పెద్ద ఆరోపణలు చేస్తారు. తీరా దొరికిపోయినప్పుడు మళ్లీ వాళ్లే పశ్చాత్తాపం వ్యక్తం చేస్తారు. ఇది ఒక దొంగ.. దొంగతనం చేస్తూ దగ్గడం వల్ల దొరికిపోయినట్లుంది. ఎన్సీఈఆర్టీ 8వ తరగతి సోషల్ బుక్ లో న్యాయవ్యవస్థలో అవినీతి అంటూ వివాదాస్పద అంశాలు చేర్చారు. 

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తనకు ఏమీ తెలియనట్టు దీనిపై విచారం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ కూడా ఇస్తున్నారు” అని ఎద్దేవా చేశారు.

©️ VIL Media Pvt Ltd.