Reading Time: < 1 minute
Tamil Nadu Tiruchendur Temple Bribery Case Minister Conducts Sting Operation On Vip Darshan Corruption

Tamil Nadu: తమిళనాడులోని ప్రముఖ తిరుచెందూరు మురుగన్ ఆలయంలో చోటుచేసుకున్న అవినీతి వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. సామాన్య భక్తుల నుంచి వీఐపీ దర్శనం పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలపై రాష్ట్ర మంత్రి రమేష్ స్వయంగా స్టింగ్ ఆపరేషన్ నిర్వహించడం సంచలనంగా మారింది.

సాధారణ భక్తుడిలా మాస్క్ ధరించి ఆలయానికి వెళ్లిన మంత్రి రమేష్.. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలోని ఓ అర్చకుడు వీఐపీ దర్శనం కల్పిస్తానంటూ మంత్రి నుంచి రూ.4 వేలు డిమాండ్ చేశాడు. ఇందుకు గాను మంత్రి కూడా అనుమానం రాకుండా గూగుల్ పే ద్వారా అర్చకుడికి రూ.4 వేలును చెల్లించారు. ఆ చెల్లింపుకు దర్శనం పూర్తయిన తర్వాత మాస్క్ తొలగించి తన అసలు వ్యక్తిత్వాన్ని బయటపెట్టడంతో అక్కడి సిబ్బంది ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

మంత్రి స్వయంగా ఇదంతా చేశాడని తెలిసిన వెంటనే సంబంధిత అర్చకుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్న అధికారులు.. అర్చకుడితో పాటు ఇద్దరు భద్రతా సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై సామాన్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆలయాల్లో జరుగుతున్న అవినీతిని బయటపెట్టేందుకు మంత్రి స్వయంగా రంగంలోకి దిగడం అభినందనీయమని పలువురు పేర్కొంటున్నారు. భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసే చర్యలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని ప్రజలు కోరుతున్నారు. మరికొందరు కొత్తగా ఏర్పాటైన విజయ్ ప్రభుత్వంతో రాష్ట్రంలో మార్పు మొదలైందంటూ చర్చించుకుంటున్నారు.