Reading Time: < 1 minute

తెలంగాణ ఉద్యమ నేతలకు ఊరట

Caption of Image.

బోధన్, వెలుగు: నిజాం షుగర్  ఫ్యాక్టరీ వ్యవహారంలో కేసులు నమోదైన పలువురు నేతలకు శుక్రవారం నిజామాబాద్​ జిల్లా బోధన్ కోర్టులో ఊరట లభించింది. 2018లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న పలువురు నేతలు ఫ్యాక్టరీని తెరిపించాలని సామాజిక తెలంగాణ నాయకుడు ఉప్పు సంతోష్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు చేపట్టారు.

అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు నిరసనలు తెలపగా, వారిపై కేసులు నమోదయ్యాయి. ఎనిమిదేండ్లుగా కోర్టు చుట్టూ తిరిగారు. పోలీసులు సరైన సాక్షాలు కోర్టులో ప్రవేశపెట్టకపోవడంతో బీర్కూరు శంకర్, మల్లేశ్, వరదయ్య, ఏశాల గంగాధర్, రాఘవులు, కొమ్ముల గంగాధర్, జె శంకర్, రాములు, సాయిలు యాదవ్, గోపిపై నమోదైన కేసులను కోర్టు కొట్టి వేసింది. దీంతో సదరు నేతలు బోధన్​లో సంబరాలు జరుపుకున్నారు.

©️ VIL Media Pvt Ltd.